Hyderabad Rains: హైదరాబాద్ లో కుండపోత వాన.. మళ్లీ ముసురేసిన నగరం..

Hyderabad Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా కృష్ణానది పరివాహాక ప్రాంతాల్లో ఇప్పటికీ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురస్తూనే ఉన్నాయి. కానీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మాత్రం గత రెండు వారాల క్రితం వరకు బాగానే పడ్డ.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఈ రోజు తెల్లవారుఝాము నుంచి హైదరాబాద్ లో వర్షాలు దంచికొడుతున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 12, 2024, 08:23 AM IST
Hyderabad Rains: హైదరాబాద్ లో కుండపోత వాన.. మళ్లీ  ముసురేసిన నగరం..

Hyderabad Rains: గత కొన్ని రోజులుగా హైదరాబాద్ వాసులకు  తెరపి ఇచ్చిన వరుణ దేవుడు.. మళ్లీ విజృంభించాడు. ఈ రోజు తెల్లవారుఝాము నుంచే హైదరాబాద్ మహా నగరంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. అంతేకాదు నగర వ్యాప్తంగా అన్ని చోట్ల ముసురేసింది. ముఖ్యంగా బంజారా హిల్స్, మణికొండ, అమీర్ పేట్, ఉప్పల్, ఘట్ కేసర్, దోమలగుడ, రామ్ నగర్, మలక్ పేట, ఓల్డ్ సిటీ, కోఠి ప్రాంతాల్లో కుండ పోత వర్షం పడింది. మరోవైపు హైదరాబాద్ ఎల్బీ నగర్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షంతో ప్రజలు ఉదయమే దూరప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. చాలా మంది వీకెండ్ సందర్భంగా స్వంత గ్రామాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారికీ వర్షం చుక్కలు చూపించింది.   మరోవైపు వర్షాలకు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలకు జలమయమయ్యాయి.

హైదరాబాద్ లో భారీ వర్షంలో ఉదయం నుంచే రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలువురు వాహనదారులు రోడ్లపైనే తమ వాహానాలను పార్క్ చేసి బస్సు, మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. భారీ వర్షంతో వాహనదారులు ముందుకు, వెనకకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.  దీంతో హైదరాబాద్ వాసులు బస్సు, మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. సోమవారం కావడంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్ శాఖ పలు చర్యలు చేపడుతోంది.

మరోవైపు వాతావరణ అధికారులు మరో రెండు మూడు రోజులు పాటు హైదరాబాద్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.  మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయిని తెలియజేసింది. హైదరాబాద్ కాకుండా తెలంగాణలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా నిర్మల్ , ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కొత్త గూడెంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. భారీ వర్షాల కారణంగా అత్యవసర పనులు మీద బయటకు  వెళ్లే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News