Kalvakuntla Kavitha: రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి అని.. రైతు భరోసాకు షరతులు పెట్టడం ఏమిటని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బేషరతుగా నిబంధనలు లేకుండా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రభుత్వాన్ని అడుక్కోవాలా? అని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తుచేశారు. స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: KTR ACB Case: 'పాపం రేవంత్ రెడ్డి.. నన్ను జైలుకు పంపాలని విశ్వ ప్రయత్నాలు'
హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం బోధన్ కార్యకర్తలతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి.. స్థానిక ఎన్నికలు.. రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాలు వంటి వాటిపై కార్యకర్తలు, నాయకులతో కవిత చర్చించారు. అనంతరం మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాకుండా చేస్తానంటున్న రైతు భరోసా పథకానికి షరతులు, నిబంధనలు పెట్టడాన్ని తప్పుబట్టారు. అన్నదాతకు సున్నం పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు షరతులు విధించడమేంటని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రభుత్వాన్ని అడుక్కోవాలా అని నిలదీశారు.
Also Read: K Kavitha: రేవంత్ రెడ్డి వైఫల్యాలపై ఎల్లుండి కల్వకుంట్ల కవిత భారీ బహిరంగ సభ
నిబంధనలను విధించకుండా బేషరతుగా రైతులందరికీ రైతు భరోసా నిధులను ఇవ్వాలని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకానికి కూడా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు. రైతులను వ్యవసాయం చేసుకోనిస్తారా లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ తిప్పలు పెడుతారా అని నిలదీశారు. కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారని.. కానీ రేవంత్ రెడ్డి కుదేలు చేస్తున్నారని మండిపడ్డారు.
స్థానిక ఎన్నికలపై
స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. ఏడాది పాలనలోనే రేవంత్ రెడ్డి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నాడని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక రేవంత్ రెడ్డి చేతులెత్తేయడంతో ప్రజలు గుర్రుగా ఉన్నారని వివరించారు. రేవంత్ రెడ్డి వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలతో కలిగిన ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా నడిస్తే తాము అండగా ఉంటామని కవిత భరోసా ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.