KT Rama Rao: రేవంత్‌ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల కుంభకోణం.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

KT Rama Rao Allegations 1000 Crore In Rice Procurement: కాంగ్రెస్‌ ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో రూ. 1000 కోట్ల కుంభకోణం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 27, 2024, 12:10 AM IST
KT Rama Rao: రేవంత్‌ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల కుంభకోణం.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

KTR Allegations: అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే పెద్ద ఎత్తున కుంభకోణంతో దోపిడీ చేశారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ముఖ్యమంత్రి  దీనిపై మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ముడుపులు వెళ్లాయని ఆరోపించారు. ధాన్యం కుంభకోణం జెడ్ స్పీడ్‌తో జరిగిందని వివరించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రేవంత్‌ ప్రభుత్వం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

Also Read: KT Rama Rao: రేవంత్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే రాకేశ్‌ రెడ్డిని గెలిపించాలి

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో సోమవారం కేటీఆర్‌ సంచలన ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ధాన్యం అమ్మకం, సన్న బియ్యం కొనుగోలులో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. 15 రోజుల కింద ఈ కుంభకోణాన్ని మా పార్టీ బయటకు తీసినా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. ఈ కుంభకోణంపై రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలేదు.. మేము లేవనెత్తిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు గుర్తుచేశారు.

Also Read: KT Rama Rao: సమాజానికి పట్టిన చీడపురుగు తీన్మార్‌ మల్లన్న.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

'బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కామ్‌లు. గల్లీమే లూటో, ఢిల్లీలో భాటో అన్నదే కాంగ్రెస్ నీతి' అని కేటీఆర్‌ అభివర్ణించారు. కాంగ్రెస్ అంటే కుంభకోణాల కుంభమేళా అని తెలిపారు. ధాన్యం సేకరణపైన దృష్టి పెట్టకుండా రైతన్నల నుంచి సేకరించిన ధాన్యంపైన కన్ను వేసి ఈ కుంభకోణానికి, అవినీతి చీకటి దందాకు  తెరలేపారని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో బీ టాక్స్, యూ టాక్స్, ఆర్ఆర్ టాక్స్ రాజ్యమేలుతోందని పేర్కొన్నారు.

ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఢిల్లీ పెద్దల ప్రమేయం కూడా ఉందని కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పని చేతనైతలేదు కానీ.. తమ జేబులు నింపుకొని ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. 

రేవంత్‌ ప్రభుత్వం కుంభకోణం ఇదే!
ధాన్యం విక్రయం కోసం అవినీతి కుట్రకు తెర తీసింది. జనవరి 25వ తేదీన కమిటీ వేసి.. అదే రోజున కమిటీ ఏర్పాటు చేసి, ఈరోజు మార్గదర్శకాలు విడుదల చేసి, అదే రోజు టెండర్లను పిలిచింది.
- 35 లక్షల ధాన్యం నమ్మకం కోసం గ్లోబల్ టెండర్ల పేరుతో పిలిచిన మొదటి స్కాం
- 2.20 లక్షల టన్నుల సన్న బియ్యం కొనుగోలు పక్రియ రెండో కుంభకోణం.
- మొత్తం రూ.వెయ్యి కోట్ల కుంభకోణం

'ధాన్యానికి రూ.2,100 క్వింటాలు చొప్పున స్థానికంగా రైస్ మిల్లు కొంటామన్నాఇవ్వకుండా, అర్హత నిబంధనలో మార్పులు చేసి గ్లోబల్ టెండర్ల పేరుతో కుట్రకు తెరలేపింది' అని కేటీఆర్‌ ఆరోపించారు. ఈ గ్లోబల్ టెండర్లను.. కేంద్రీయ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే సంస్థలు దక్కించుకున్నాయి. ఈ సంస్థల్లో కేంద్రీయ భండార్‌ను మా ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెడితే.. ఆ సంస్థకు నిబంధనలో మినహాయింపు ఇచ్చి బ్లాక్‌లిస్టు కంపెనీని టెండర్లను పాల్గొనేలా చేసింది. టెండర్‌లో క్వింటాలుకు రూ.1,885 నుంచి రూ.2,007కు కోట్ చేసి దక్కించుకున్నాయి. రూ.93 నుంచి 200 రూపాయల తక్కువకు గ్లోబల్ టెండర్లు పిలిచి కట్టబెట్టారు' అని కేటీఆర్‌ వివరించారు.

'గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకెళ్లకుండా.. ఈ 4 సంస్థలు కేవలం ధాన్యం మాత్రమే సేకరించుకుని వెళ్లాలి. కానీ మిల్లర్లతో డబ్బులు తీసుకొని మనీ లాండరింగ్ పాల్పడుతున్నాయి. క్వింటాలుకు రూ.2,230 తమకు చెల్లించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 వేల రైస్ మిల్లర్లను ఈ కాంట్రాక్ట్ సంస్థలు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాయి. కాంట్రాక్ట్ సంస్థలు చెబుతున్న కారణాలు.. సీఎం పేషీకి ఖర్చయిందట.. ఢిల్లీ ఏఐసీసీ పెద్దలకు వాటాలు పంపించారట. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖజానా నింపారట.. అందుకే క్వింటాలుకు  కనీసం రూ.150 వరకు అదనంగా కలిపి చెల్లించాలని రైస్ మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు. అని కేటీఆర్‌ తెలిపారు.

'35 లక్షల మెట్రిక్ టన్నులకు కనీసం రూ. 200 చొప్పున అదనంగా వసులు చేసి 700 కోట్ల రూపాయలను మిల్లర్ల నుంచి వసూలు చేశాయి. ధాన్యం కొనుగోలు కోసం టెండర్లు వేసిన ఈ సంస్థలు డబ్బులు ఎట్లా వసూలు చేస్తున్నాయి. మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేసే అధికారం ప్రైవేటు సంస్థలకు ఎవరు కట్టబెట్టారు. మే 23 నాటికి నాలుగు సంస్థలకు వచ్చిన గడువు ముగిసిన తర్వాత.. ధాన్యం సేకరించి మిల్లులను ఖాళీ చేయాలి. డెడ్‌లైన్ అయిపోయిన తర్వాత నిబంధనలు ప్రకారం ఆ సంస్థల పైన కఠిన చర్యలు తీసుకోవాలి' కేటీఆర్‌ వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News