KTR: హైదరాబాద్ నుంచే తొలి కరోనా వ్యాక్సిన్

తెలంగాణ నుంచే క‌రోనా వైర‌స్‌ (Coronavirus) కు తొలి వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని, దీనికోసం దేశం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తుందని ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కే. తారక రామారావు (KTR) పేర్కొన్నారు. 

Last Updated : Aug 4, 2020, 02:56 PM IST
KTR: హైదరాబాద్ నుంచే తొలి కరోనా వ్యాక్సిన్

Bharat Biotech Covid-19 vaccine: హైద‌రాబాద్‌: తెలంగాణ నుంచే క‌రోనావైర‌స్‌ ( Coronavirus ) కు తొలి వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని, దీనికోసం దేశం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తుందని ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కే. తారక రామారావు ( KTR ) పేర్కొన్నారు. తెలంగాణ హైద‌రాబాద్‌‌కు చెందిన ఫార్మా దిగ్గజం భార‌త్‌ బ‌యోటెక్ ( bharat biotech ) సంస్థ నుంచే కోవ్యాక్సిన్ రూపొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. హైద‌రాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భార‌త్ బ‌యోటెక్ వ్యాక్సిన్ ప్రొడ‌క్ష‌న్ సెంట‌ర్‌ను మంగళవారం కేటీఆర్ సంద‌ర్శించారు. మంత్రి కేటీఆర్‌ వెంట భారత్ బయోటెక్ సీఎండీ డాక్ట‌ర్ కృష్ణ ఎల్లా,  ఆయన శ్రీమ‌తి సుచిత్రా ఎల్లా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ భార‌త్ బ‌యోటెక్ సంస్థ ఉద్యోగుల‌తో నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు.  క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ త‌యారీలో భార‌త్‌ బ‌యోటెక్ కంపెనీ ముందంజంలో ఉండ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. క‌రోనాకు వ్యాక్సిన్ ముందుగా హైద‌రాబాద్ నుంచే వస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.  Also read: RGV Murder song: పిల్లల్ని ప్రేమించడం తప్పా..?

కరోనా అన్నిచోట్ల విలయతాండవం చేస్తోందని.. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అభివృద్ధిలో భార‌త భాగ‌స్వామ్యం కీల‌క‌మైంద‌ని మంత్రి అన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ అవ‌స‌రాల దృష్ట్యా హైద‌రాబాద్ ప్రాముఖ్య‌త కూడా పెరిగిందన్నారు. హైద‌రాబాద్ నుంచి చాలా రకాల వ్యాక్సిన్లు ప్ర‌పంచ దేశాల‌కు అందించ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తల నిరంత‌ర కృషి వ‌ల్లే ఇది సాధ్య‌మవుతోంద‌ని మంత్రి తెలిపారు. ఈ చర్చలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైర‌క్ట‌ర్ శ‌క్తి నాగ‌ప్ప‌న్‌, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథ‌న్ కూడా పాల్గొన్నారు.   పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే..  

Trending News