Cold Waves: తెలంగాణకు వణికిస్తున్న చలి పులి.. మరో 15 రోజులు చుక్కలే..

Cold Waves in Telangana : తెలంగాణలో చలిపులి చంపేస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.  ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ ప్రజలు  గజ గజ వనుకుతున్నారు. దీంతో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 16, 2024, 07:04 AM IST
Cold Waves: తెలంగాణకు వణికిస్తున్న చలి పులి.. మరో 15 రోజులు చుక్కలే..

Cold Waves: తెలంగాణ ఒక్కసారి తగ్గిన ఉష్ణోగ్రతలతో చలి తీవ్రంగా పెరిగింది. దీంతో ప్రజలు  ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా రాత్రి సాధారణం కన్నా 5.5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
 
అతితక్కువగా బేల గ్రామంలో 6.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డ్ అయింది.భీంపూర్‌ మండలం అర్లిలో 6.9 డిగ్రీల సెల్సియస్, పిప్పల్‌ధరి 7.1 డిగ్రీల సెల్సియస్, భరంపూర్‌ 7.1 డిగ్రీల సెల్సియస్, జైనథ్‌ మండల కేంద్రం 7.2 డిగ్రీల సెల్సియస్ , రామ్‌నగర్‌ 7.2 డిగ్రీల సెల్సియస్, నేరడిగొండ మండల కేంద్రం 7.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌ అర్బన్‌ 8.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 9.8 డిగ్రీల సెల్సియస్ రికార్డు  అయ్యింది.

ఇటు  హైదరాబాద్ నగరంలోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 14 డిగ్రీల సెల్సియస్‌కు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, అసిఫాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుందని చెప్పారు. ఈ మేరకు హెచ్చరికలు జారీచేశారు. ముఖ్యంగా చలికి పిల్లలు, వృద్దులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ మరో 15 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..

ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News