Telangana Formation Day Wishes: తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సంస్కృతి ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. వ్యాపారపరంగా, ఇతర అన్ని రంగాలలో రాణించాలని, ప్రతి ఇంటికి తాగునీరు అందాలని, రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఉదయం ట్వీట్ చేశారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీలు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ (Telangana Formation Day) శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు నిలయమైన తెలంగాణ.. సహజ వనరులతో, నైపుణ్యం కల్గిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానంటూ’ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
Also Read: EPFO Good News For PF Subscribers: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, 3 రోజుల్లో క్లెయిమ్
Greetings to all especially to the people of Telangana on Statehood Day. I wish Telangana continues to expand its traditional, modern & futuristic industries. It has fulfilled the national objective of providing water to every home. Wishing a bright future for the people of state
— President of India (@rashtrapatibhvn) June 2, 2021
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు నిలయమైన తెలంగాణ.. సహజ వనరులతో, నైపుణ్యం కల్గిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను. #Telangana
— Vice President of India (@VPSecretariat) June 2, 2021
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భిన్నమైన సంస్కృతిని, కష్టించే తత్వాన్ని తెలంగాణ ప్రజలు కలిగి ఉన్నారని కొనియాడారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, మరింత వృద్ధి సాధించాలని ప్రధాని మోదీ (PM Narendra Modi) ఆకాంక్షించారు.
Best wishes to the people of Telangana on the state’s Formation Day. The state is blessed with a unique culture and hardworking people who have excelled in many areas. Praying for the good health and well-being of the people of Telangana.
— Narendra Modi (@narendramodi) June 2, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook