Cyber Attack: కోవిడ్-19 వ్యాక్సిన్ రీసెర్చ్ అంశాలను దొంగలించే పనిలో చైనా

అమెరికా ( America ) అధికారులు కీలక వ్యాఖ్యాలు చేశారు.

Last Updated : Sep 29, 2020, 08:58 PM IST
    • అమెరికా అధికారులు కీలక వ్యాఖ్యాలు చేశారు.
    • అమెరికా ఫార్మా సంస్థలపై సైబర్ ఎటాక్ జరిగింది అని సమాచారం.
    • డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త అండ్ హ్యూమన్ సర్వీసెస్ పై సైబర్ అటాక్ జరిగింది అని తెలుస్తోంది.
    • ఈ ఆరోపణలు చైనాపై వస్తున్నాయి.
Cyber Attack: కోవిడ్-19 వ్యాక్సిన్ రీసెర్చ్ అంశాలను దొంగలించే పనిలో చైనా

అమెరికా ( America ) అధికారులు కీలక వ్యాఖ్యాలు చేశారు. అమెరికా ఫార్మా సంస్థలపై సైబర్ ఎటాక్ జరిగింది అని సమాచారం. డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త అండ్ హ్యూమన్ సర్వీసెస్ పై సైబర్ అటాక్ జరిగింది అని తెలుస్తోంది. ఈ ఆరోపణలు చైనాపై వస్తున్నాయి.

కరోనావైరస్ తో ( Coronavirus ) ప్రపంచానికి వణికిస్తోన్న చైనా ఇప్పుడు వ్యాక్సిన్  రహస్యాలను దొంగలించే పనిలో పడింది. చైనా తమ ఏజెన్సీల ద్వారా అమెరికాలోని మెడికల్ సంస్థలపై సైబర్ ఎటాక్ చేస్తోంది అని యూఎస్ అంటోంది.  విలువైన సమాచారం దొంగిలించేందుకు ప్రయత్నిస్తోంది అని సమాచారం.

ALSO READ| Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు

వ్యాక్సిన్ తో సంబంధం ఉన్న రీసెర్చ్ ను దొంగలించే ప్రయత్నం
అమెరికా ఈ విషయంలో ఇచ్చిన వివరణ ప్రకారం ఆ దేశం కరోనావైరస్ కు ( Covid-19) వ్యతిరేకంగా వ్యాక్సిన్ కోసం సేకరించిన పరిశోధన అంశాలను చైనా దొంగలించేందుకు ప్రయత్నం చేస్తోందట. ఇలాంటి ఆరోపణలు చైనాపై రావడం ఇది మొదటి సారి కాదు. ప్రపంచ వ్యాప్తంగా చైనా సైబర్ ఎటాక్ చేస్తుంది అని పలు ఆరోపణలు ఇంతకు ముందు పలు సార్లు వచ్చాయి .

అమెరికా అధికారుల ప్రకారం అమెరికాలో ఉన్న ప్రముఖ వైద్య సంస్థలు, రీసెర్చ్ ఇన్ స్టీట్యూట్స్,  మెడిల్ ఏజెన్సీల నుంచి సమాచారం సేకరించేందుకు చైనా (  China ) సైబర్ ఎటాక్ చేస్తోందట. హెల్త్ కేర్, రీసెర్చ్ ల్యాబ్, పార్మా కంపెనీలపై కూడా దాడులు చేస్తోందట చైనా.

రెండు దేశాలపై అనుమానం
అమెరికా ప్రకారం ప్రపంచంలో ఇప్పుడు కేవలం రెండు దేశాలు మాత్రమే ఇలాంటి సైబర్ చౌర్యం చేసే అవకాశం ఉండట. అందులో ఒకటి చైనా కాగా.. మరోకటి రష్యా అని చెబుతోంది అమెరికా.
కరోనావైరస్ ను ఎదుర్కొనేందుకు నేడు ప్రపంచ వ్యాప్తంగా బయోమెడికల్ రీసెర్చ్ జరుగుతోంది. వ్యాక్సిన్ తయారుచేసిన తొలి దేశానికి మంచి లాభాలు లభించే అవకాశం ఉంది. అమెరికా ఇందులో దూసుకెళ్తోంది. అందుకే చైనా ఇలా చేస్తోంది అంటోంది అమెరికా.

ALSO READ|   Shopping Tips: కోవిడ్-19 సమయంలో మాల్ కి వెళ్తున్నారా ? ఇది చదవండి.

హెచ్చరించిన అమెరికా విదేశాంగ మంత్రి
ఇటీవలే అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఈ విషయంలో కీలక వ్యాఖ్యాలు చేశారు.  చైనా సైబర్ ఎటాక్ చేసే అంశాన్ని అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News