AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. అయితే ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ సమావేశాలు మొత్తం అధికార పక్షాలే ఉండనున్నాయి. గత సమావేశాల సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడంతో ఈ సమావేశాల్లో పద్దులు ప్రవేశపెట్టనున్నారు.
Also Read: Pawan Kalyan: రోడ్డుకు అడ్డంగా పవన్ కల్యాణ్ కాన్వాయ్.. అంబులెన్స్‌లో రోగి మృతి
అమరావతిలోని అసెంబ్లీలో ఉదయం 10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కి ఆమోద ముద్ర తెలుపనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ వాయిదా పడుతుంది. అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన సభా నిర్వహణ కమిటీ (బీఏసీ) సమావేశం కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరగాలని బీఏసీ నిర్ణయించనుంది. మొత్తం పది రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
Also Read: Chandrababu: దళితులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. ఏం చెప్పారో తెలుసా?
అమరావతిలోని అసెంబ్లీలో జరగనున్న సమావేశాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయనున్నారు. ఈ సమావేశాల ఏర్పాట్లపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కార్యాలయంలో ఆదివారం డీజీపీ హెచ్ ద్వారకా తిరుమల రావు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, శాసనసభ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ తదితరులతో సమావేశమయ్యారు. సమావేశాల నిర్వహణపై పోలీస్ శాఖతో చర్చించారు.
మాజీ సీఎం జగన్ బహిష్కరణ
గత సమావేశాలు కేవలం సభ్యుల ప్రమాణస్వీకారానికి మాత్రమే జరగ్గా ఈసారి జరగనున్న సమావేశాల్లో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఈ సమావేశాల్లో కూటమిలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీలు మాత్రమే కనిపించనున్నాయి. ప్రతిపక్షంగా తమను గుర్తించకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకున్నా ప్రతిరోజు సమావేశాలపై మీడియా ముఖంగా ప్రశ్నిస్తానని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.