రెయిన్ అలర్ట్ : ఈ మూడు రోజులూ ఇక వర్షాలేనా ?

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు

Last Updated : Aug 30, 2018, 07:27 PM IST
రెయిన్ అలర్ట్ : ఈ మూడు రోజులూ ఇక వర్షాలేనా ?

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో హైదరాబాద్‌లోని పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇంకొన్ని చోట్ల తేలికపాటి జల్లులు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఈ సందర్భంగా వాతావరణ శాఖ అధికారులు స్పష్టంచేశారు. 

రానున్న మూడు రోజులపాటు ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లగా మారే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలావుంటే, బుధవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, ఆదిలాబాద్‌ సహా పలు ఇతర ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

Trending News