Rain Alert: వేసవికాలం ముగుస్తున్న సమయంలో ఎండలు మరింత తీవ్రమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో తెలుగు ప్రజలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో వాతావరణ శాఖ శుభవార్త వినిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం మోస్తరు వర్షాలు, మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎండీ కూర్మనాథ్ వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read: Exit Polls KCR: గెలిచినా.. ఓడినా తెలంగాణ రక్షణ కవచం బీఆర్‌ఎస్ పార్టీ
అకాల వర్షాలు సోమవారం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం తదితర జిల్లాలో పడుతాయని వివరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాల సమయంలో బయట తిరగవద్దని తెలిపారు. ఇక ఎల్లుండి మంగళవారం రోజు వైస్సాఆర్, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: AP Election Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఈసీ సంచలన నిర్ణయం.. వైన్స్‌కు ఎగబడిన మందుబాబులు
తెలంగాణలో..
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో తెలంగాణలో కూడా వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే ఆదివారం రాత్రి మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్‌లో సాయంత్రం పూట భారీ వర్షం పడింది. దాదాపు నగరవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాహనదారులు కొత ఇబ్బంది పడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter