Chiranjeevi: గతేడాది మెహర్ రమేశ్ దర్శకత్వంలో చేసిన ‘భోళా శంకర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇకపై చేయబోయే సినిమా కథల విషయంలో చిరంజీవి పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. అందుకే ఒకప్పటిలా ఎడాపెడా ఏ సినిమా రీమేక్ లను చేయోద్దనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అంతేకాదు తన ఇమేజ్ కు తగ్గ మూవీలను చేయాలని డిసైండ్ అయినట్టు సమాచారం. అందుకే ‘భోళా శంకర్’ తర్వాత చేద్దామనుకున్న సినిమాలను పక్కన పెట్టి.. వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. మునుపటిలా రీమేక్ అంటే.. మన ఆడియన్స్ కు అంతగా తెలిసేది కాదు. ఏది కొద్ది మంది మాత్రమేఆ సినిమాల గురించి తెలిసేది. ఇపుడు టెక్నాలజీతో పాటు ఓటీటీ వేగంగా దూసుకువస్తోంది.దీంతో ఏదైనా భాషలో హిట్టైన సినిమాలను సబ్ టైటిల్స్ తో చూసేస్తున్నారు ప్రేక్షకులు. వాళ్ల మైండ్ సెట్ కూడా పూర్తిగా మారిపోయింది.
ఏదైనా హీరో చేస్తున్న సినిమా ఫలానా రీమేక్ అంటే ప్రేక్షకులు కూడా నెట్ లో ఆ సినిమాను గూగుల్ చేసి మరి చూసేస్తున్నారు. అంతేకాదు ఒకవేళ ఆయా కథానాయకులు సినిమాలు రీమేక్ చేసినా.. ఆయా చిత్రాలతో పోలుస్తున్నారు. ఒకవేళ బాగా ఉంటే.. ఓకే కానీ.. తేడా కొడితే మాత్రం అంతే సంగతులు. వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా ఏకి పారేస్తున్నారు.
చిరంజీవి లాస్ట్ మూవీ ‘భోళా శంకర్’ విషయంలో అదే జరిగింది. నెటిజన్స్ ఈ సినిమాను ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు.
ఈ సినిమా .. తమిళంలో అజిత్ హీరోగా నటించిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్. ఆల్రెడీ ఔట్ డేటెడ్ సబ్జెక్ట్ కావడం .. అప్పటికే తమిళంలో అజిత్ ఇమేజ్ తో ఈ సినిమా హిట్టైయింది. కానీ తెలుగులో దర్శకుడు మెహర్ రమేశ్ ఆ సినిమాను ఏ కోశానా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసేలా తెరకెక్కించలేకపోయాడు. .
ఆల్రెడీ చిరంజీవి అభిమానులు మెహర్ రమేశ్ తో సినిమా అంటేనే భయపడ్డారు. చివరకు వాళ్లు ఏదైతే అనుకున్నారో.. అదే జరిగింది. అయితే ‘భోళా శంకర్’ విషయంలో.. ఆల్రెడీ ప్రూవ్ డ్ సబ్జెక్ట్ కాబట్టి చిరు రిస్క్ ఉండదని అనుకున్నారు. తీరా మొదటికే మోసం వచ్చింది. దీంతో ‘భోళా శంకర్’ మూవీ తర్వాత చేద్దామనుకున్న ‘బ్రో డాడీ’ రీమేక్ ను పూర్తిగా పక్కనపెట్టేసాడు చిరంజీవి.
ఇక విశ్వంభర తర్వాత చిరు ఇమేజ్ కు తగ్గ స్టోరీలు రావడం లేదనే టాక్. మరోవైపు వేరే భాషల్లో హిట్టైన సినిమాలను రీమేక్ చేద్దామంటే అంత ఈజీ వ్యవహారం. చిరు.. కెరీర్ లో హిట్టైన ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, ఠాకూర్, ఖైదీ నంబర్ 150 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా పక్కన భాష నుంచి అరువు తెచ్చుకున్నవే. ఇలాంటి రీమేక్ సినిమాలు చిరు కెరీర్ లో చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి.. ‘విశ్వంభర’ సినిమా తర్వాత ఏ సినిమాను ఓకే చేయలేదు. ఒకే వేళ ఒప్పుకుంటే.. ఆ సినిమా స్టోరీ వేరే లెవల్లో ఉండాల్సిందే.
మరి ఆగష్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్బంగా కొత్త సినిమాను ఏమైనా అనౌన్స్ చేస్తాడా ? లేదా అనేది చూడాలి. అభిమానులు మాత్రం ‘విశ్వంభర’ సినిమా తర్వాత పవర్ ఫుల్ డైరెక్టర్ తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. మరి ఈ పుట్టినరోజున ఏదైనా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ చేసి ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తాడా లేదా అనేది చూడాలి.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter