Deadpool and Wolverine: 'డెడ్‌పూల్ & వోల్వారిన్' టీజర్ విడుదల…మెస్మరైజింగ్ ఎఫెక్ట్స్ తో ఆకట్టుకుంటున్న మార్వెల్ యూనివర్స్

Deadpool and Wolverine Teaser: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి యూనివర్స్ నుంచి మరో అద్భుతమైన చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ చిత్ర టీజర్ ని.. ఈరోజు విడుదల చేయగా టీజర్ అందరి దగ్గర నుంచి ఎంతో ఆదరణ పొందుతోంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2024, 01:14 PM IST
Deadpool and Wolverine: 'డెడ్‌పూల్ & వోల్వారిన్' టీజర్ విడుదల…మెస్మరైజింగ్ ఎఫెక్ట్స్ తో ఆకట్టుకుంటున్న మార్వెల్  యూనివర్స్

Marvel Cinematic Universe: మార్వెల్ యూనివర్స్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆ సినిమాటికి యూనివర్స్ నుంచి సినిమా వస్తోంది అంటే చాలు అంచనాలు భారీగా ఏర్పరుతాయి. కాగా ప్రస్తుతం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మ‌రో సూప‌ర్ హీరో మూవీ రాబోతుంది. ఇప్ప‌టికే మార్వెల్ యూనివర్స్ నుంచి వ‌చ్చిన డెడ్‌పూబ్లా సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఈ సిరీస్ నుంచి మ‌రో సినిమా రాబోతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వ‌స్తున్న తాజా చిత్రం ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’.

ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాక్‌మాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. ఈ సినిమాకి షాన్ లెవీ ద‌ర్శ‌క‌త్వం వహించారు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంట‌ర్‌టైన‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా మేక‌ర్స్ టీజ‌ర్ విడుదల చేశారు.

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News