Delhi Babu: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నిర్మాత ఢిల్లీ గణేష్ ఈ రోజు ఉదయం మృతి చెందారు. తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో సూర్యతో రాక్షసన్, ఓ మై గాడ్, బ్యాచిలర్ వంటి పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. యాక్సెస్ ఫిల్మ్ బ్యానర్ పై ఈయన తెరకెక్కించిన పలు చిత్రాలు తెలుగులో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా మిరల్, మరకతమణి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి.
ఢిల్లీ బాబు మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు విషారం వ్యక్తం చేస్తున్నారు. ఈయన 1965 ఫిబ్రవరి 12న జన్మించారు. ఈయన వయసు 59 సంవత్సరాలు. ఈయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ తరుపున తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాల్లో కూడా సత్తా చాటారు. ఈయన మృతిపై సీపీఎం అనుబంధ సంఘాలు కూడా తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ముఖ్యంగా తమిళంలో హార్రర్ చిత్రాల నిర్మాతగా పేరు గడించారు. ఆయన నిర్మించిన చాలా చిత్రాలు హార్రర్ నేపథ్యంలో తెరకెక్కి ప్రేక్షకులను అలరించాయి. సూర్యతో తెరకెక్కించిన ‘రాక్షేసుడు’, ఆది పినిశెట్టితో తీసిన ‘మరకతమణి’, మిరల్, కాల్వన్, కుట్రమ్ కుట్రమే చిత్రాలు కూడా హార్రర్ నేపథ్యంలో తెరకెక్కి ప్రేక్షకులను అలరించాయి.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.