Meenakshi Chaudhary: ఆ విషయంలో తగ్గేదెలా అంటున్న స్టార్ హీరోయిన్..!

Meenakshi Chaudhary demands: తెలుగు ఇండస్ట్రీ లో ఇప్పుడిప్పుడే తనకంటూ మంచి పేరు తెచ్చుకుంటున్న మీనాక్షి చౌదరి నిర్మాతలకు మాత్రం లేని పోని కొత్త తలనొప్పులు తీసుకువస్తుంది. ఆమె చేస్తున్న డిమాండ్స్ కి స్టార్ నిర్మాతలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక్కరోజు కి ఇంత అంటూ నిర్మాతలను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తోందట ఈ భామ. 

Written by - | Last Updated : Dec 15, 2024, 05:54 PM IST
Meenakshi Chaudhary: నిర్మాతల ఆర్థిక ఇబ్బందులను డబల్ చేస్తున్న స్టార్ బ్యూటీ.. మీనాక్షి చౌదరి డిమాండ్స్ మామూలుగా లేవుగా..

Meenakshi Chaudhary controversy: టాలివుడ్ లో ఈ ఏడాది మీనాక్షి చౌదరి నటించిన సినిమాలు కొన్ని బాగానే సందడి చేసినా.. ఆమెకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు అని చెప్పచ్చు. 2024లో ఆమె ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 సినిమాల్లో నటించింది. కానీ అందులో ఒక్క సినిమా మాత్రమే హిట్ అయ్యింది. అదే లక్కీ భాస్కర్.. ఈ సినిమా హిట్ అవ్వడానికి కూడా ఈమె కంటే ఎక్కువ దుల్కర్ సల్మాన్ నటనే కారణం అని చెప్పచ్చు.

అయితే జయాపజయాలు పక్కన పెట్టేస్తే మీనాక్షి చౌదరి వైఖరి మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా నిలిచింది. నిన్నగాక మొన్న పెద్ద హీరోలతో సినిమాలు మొదలుపెట్టిన ఈమె చేస్తున్న డిమాండ్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మీడియా సైట్ డెక్కన్ క్రానికల్ కథనాల ప్రకారం మీనాక్షి చౌదరి కి సంబంధించిన కొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 

మామూలుగా సినిమాలో నటీనటుల బస, భోజనం వంటి ఖర్చులు నిర్మాతలు భరించడం చాలా సహజం. కానీ, ఈ మధ్య కాలంలో కొంత మంది స్టార్లు మాత్రం ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైవ్-స్టార్ హోటల్స్‌లో సూట్ రూమ్ లు మాత్రమే కావాలని స్టార్లు నిర్మాతలను ఒత్తిడి పెడుతున్నారు. 

దీనివల్ల నిర్మాతలకు భారీగా ఖర్చు అవుతోంది అని ఒక ప్రముఖ నిర్మాత కూడా చెప్పారు. ఇలాంటి వారిలో మీనాక్షి చౌదరి కూడా ఒకరట. మీనాక్షి చౌదరి ఇటీవల హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు. సహజంగా షూటింగ్ ఉన్నా లేకపోయినా ఆమె ఉండేది అదే ఇంట్లో. ఆల్రెడీ ఇంట్లోనే ఉంటూ కూడా ఈమె నిర్మాతల దగ్గర నుండి భారీగా రెంట్ తీసుకుంటోందట. ఆమె కోఆర్డినేటర్ అమర్ పుట్ట నిర్మాతలకి రోజుకు రూ.18,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారట. 

ఇది ఒక పెద్ద స్టార్ హోటల్ ఖర్చుకు సమానమని, కానీ ఆమె ఫ్లాట్‌లోనే అంటూ కూడా రెంట్ డబ్బులు అడుగుతున్నట్టు నిర్మాతలు వాపోతున్నారు. ఈ రకంగా ఈమె వల్ల నిర్మాతలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒక నటిగా మీనాక్షి మంచి మార్కులే వేయించుకుంటోంది కానీ.. తన వ్యవహారశైలి మాత్రం చెడు ప్రభావం చూపుతోందని పలువురు వాదిస్తున్నారు. 

ఒక్కో సినిమాకి ఆమె తన స్టాఫ్ కి ఇవ్వాల్సిన పెమెంట్ కూడా పెంచుతూ వస్తోంది అని.. ఆమె రేట్ కార్డులు చూసి నిర్మాతలు షాక్ అవుతున్నారు అని తెలుస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమ ఈమధ్యనే ఈ సమస్యను పరిష్కరించి, తారల డిమాండ్లను తీవ్రంగా నిరాకరించింది. కానీ, తెలుగు పరిశ్రమలో ఇప్పటికీ నిర్మాతలు ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 

Also Read: Hyderabad Real Estate: సొంతింటి కలను తీరుస్తున్న గండిమైసమ్మ..ఇల్లు కొనే ప్లాన్‎లో ఉంటే ఈ ఏరియాలో చౌక ధరలకే అందుబాటులో  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News