Bigg Boss Telugu 8 Winner Prize Money: బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిఖిల్ మలియక్కల్ నిలిచారు. 105 రోజుల సుదీర్ఘ గేమ్‌లో నిఖిల్ తన ఆటతీరుతో ఆకట్టుకుని, ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ఇక ఈ సీజన్ కి గాను ఇతను గెలుచుకున్న ప్రైజ్ మనీ వివరాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నిఖిల్ సీజన్ 8లో విన్నర్ గా నిలిచినందుకు..టైటిల్‌తో పాటు రూ.55 లక్షల ప్రైజ్ మనీ, లగ్జరీ కార్‌ను గెలుచుకున్నాడు.
కర్ణాటకకు చెందిన నిఖిల్ మలియక్కల్.. గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ సీరియల్‌లో పార్థుగా తన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందాడు. కన్నడ సీరియల్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టిన నిఖిల్, తెలుగులో పలు సీరియల్స్‌లో నటించి..మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'గోరింటాకు', 'కలిసివుంటే కలదు సుఖం', 'స్రవంతి', 'ఊర్వశివో రాక్షసివో' వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
బిగ్ బాస్ గేమ్‌లో మొదటి నుంచి నిఖిల్ తన బిహేవియర్ తో అలానే తన ఆటలతో.. అందరినీ ఆకట్టుకున్నాడు. ఫిజికల్ టాస్క్‌లలో పులిలా పోరాడి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఓజీ క్లాన్‌ని ముందుండి నడిపించడంలో.. కీలక పాత్ర పోషించాడు. ప్రత్యేకంగా, గేమ్‌లో ఎమోషనల్ మూమెంట్స్‌ని కూడా తన అనుభవంతో హ్యాండిల్ చేసి, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన గౌతమ్, నిఖిల్‌కి గట్టి పోటీ ఇచ్చాడు. టైటిల్ రేస్‌లో చివరి వరకు గౌతమ్ నిలబడ్డాడు. చివరకు, నిఖిల్ విజేతగా నిలవగా.. గౌతమ్ మరో స్థానంలో నిధి చారు. ఇక నిఖిల్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే..గోరింటాకు సీరియల్‌లో నటించిన సమయంలో నిఖిల్ తన సహనటులు కావ్యశ్రీతో ప్రేమలో పడగా, ఆ సంబంధం ఆరేళ్ల తర్వాత విరగడం గేమ్‌లో చర్చనీయాంశమైంది. నిఖిల్, కావ్యతో తనకు సంబంధం పునరుద్ధరించాలని పలు సందర్భాల్లో వ్యక్తపరిచాడు.
తెలుగు ప్రేక్షకులు తమ అభిమానాన్ని వ్యక్తం చేయడంలో కులం, మతం అనే అడ్డంకులు లేవని, నిఖిల్‌ని విజయవంతం చేయడం ద్వారా మరోసారి నిరూపించారు. ఆయన కన్నడ నటుడైనప్పటికీ, తన గేమ్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో.. స్థానం సంపాదించుకున్నారు. మొత్తానికి, నిఖిల్ మలియక్కల్ గెలవడం బిగ్ బాస్ సీజన్ 8కి విజయవంతమైన ముగింపు పలికింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.