Tollywood బర్నింగ్ స్టార్ Sampoornesh Babu లేటెస్ట్ మూవీ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌పై అప్‌డేట్

Sampoornesh Babu Latest News: ‘హృద‌య‌ కాలేయం’, ‘కొబ్బరిమ‌ట్ట’ లాంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు తాజాగా ఓ ప్రాజెక్టుతో ముందుకు రాబోతున్నాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 9, 2021, 01:50 PM IST
  • టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గత కొంతకాలం గ్యాప్ తీసుకున్నాడు
  • తాజాగా వరుస సినిమా షూటింగులతో సంపూర్ణేష్ బాబు బిజీబిజీగా
  • రేపు తన మూవీ ఫస్ట్ లుక్ సహా మోషన్ పోస్టర్ విడుదలపై అప్‌డేట్
Tollywood బర్నింగ్ స్టార్ Sampoornesh Babu లేటెస్ట్ మూవీ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌పై అప్‌డేట్

Sampoornesh Babus Bazaar Rowdy First Look And Motion Poster: టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గత కొంతకాలం నుంచి ఎక్కువగా తెరపై కనిపించలేదు. కానీ ‘హృద‌య‌ కాలేయం’, ‘కొబ్బరిమ‌ట్ట’ లాంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు తాజాగా ఓ ప్రాజెక్టుతో ముందుకు రాబోతున్నాడు.

 

సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ‌జారు రౌడీ’. ఇటీవ‌ల ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ జరిగింది. క్లైమాక్స్ తర్వాత కొన్ని స్టిల్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో తన తరువాతి ప్రాజెక్టుపై సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) ఓ అప్‌డేట్ అందించాడు. రేపే మొదటి లుక్ అంటూ తన 5వ సినిమా అప్‌డేట్ పోస్ట్ చేశాడు.

 

Also Read: Janhvi kapoor: శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్హవిని ఇలా చూస్తే..అంతే ఇక

 

కేఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో టాలీవుడ్(Tollywood) నిర్మాత సందిరెడ్డి శ్రీనివాస‌రావు ‘బజారు రౌడీ‌’  సినిమాను నిర్మిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు సరసన మ‌హేశ్వరి వద్ది నటిస్తోంది. సీనియర్ ఎడిటర్ గౌతంరాజు ఎడిటింగ్, ఎ. విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ, సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు.

 

 

ఈ సినిమాలో నాగినీడు, షాయాజీ షిండే, పృథ్వీ, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌, తదితరులు నటించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని విడుద‌ల చేయ‌టానికి అంతా సిద్ధం చేసినట్లు మూవీ యూనిట్ తెలిపింది.

Also Read: Yami Gautam: యామీ గౌతమ్ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు ఎందుకు వైరల్ అవుతున్నాయో తెలుసా 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News