18 ఏళ్లకు పైబడిన వారు COVID-19 vaccine కోసం తమ పేర్లు ఇలా నమోదు చేసుకోవచ్చు

COVID Vaccination registration for those above 18+ on CoWin: న్యూ ఢిల్లీ: కరోనా కట్టడి కోసం మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని ఇటీవలే కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కేంద్రం శనివారం నుండే.. అంటే ఏప్రిల్ 24 నుంచి కొవిన్ అధికారిక పోర్టల్‌పై (CoWin portal) 18 ఏళ్లు పైబడిన వారికి తమ పేర్లు నమోదు చేసుకునే వీలు కల్పించింది.

Last Updated : Apr 22, 2021, 01:23 PM IST
  • మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి COVID-19 vaccine ఇవ్వనున్నట్టు ప్రకటించిన కేంద్రం.
  • 18 ఏళ్లు నిండిన వారు ఏప్రిల్ 24 నుంచి CoWin portal పై తమ పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం.
  • కరోనా వ్యాక్సిన్ కోసం తమ పేర్లు ఎలా నమోదు చేసుకోవాలో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
18 ఏళ్లకు పైబడిన వారు COVID-19 vaccine కోసం తమ పేర్లు ఇలా నమోదు చేసుకోవచ్చు

COVID Vaccination registration for those above 18+ on CoWin: న్యూ ఢిల్లీ: కరోనా కట్టడి కోసం మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని ఇటీవలే కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కేంద్రం శనివారం నుండే.. అంటే ఏప్రిల్ 24 నుంచి కొవిన్ అధికారిక పోర్టల్‌పై (CoWin portal) 18 ఏళ్లు పైబడిన వారికి తమ పేర్లు నమోదు చేసుకునే వీలు కల్పించింది. 

CoWin పోర్టల్‌పై COVID-19 vaccine కోసం తమ పేర్లు ఎలా నమోదు చేసుకోవాలి ? How to register your name for covid-19 vaccine on CoWIN portal:

Step 1) కొవిన్ అధికారిక సెబ్‌సైట్‌ cowin.gov.in లోకి లాగాన్ అవ్వాలి.

Step 2) మీ Mobile number ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Step 3) మీ మొబైల్ నెంబర్‌కి వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది.

Step 4) ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీ వివరాలు నమోదు చేయాలి. అలాగే మీ వివరాలను తెలిపే photo identity card కూడా అప్‌లోడ్ చేయాలి.

Also read : Corona second wave symptoms: Oxygen levels ఎంత ఉంటే నార్మల్ ?ఎంత తక్కువ ఉంటే రిస్క్?

Step 5) అన్ని వివరాలను నింపిన తర్వాత మీకు వీలైన సమయాన్ని షెడ్యూల్ చేసుకునేందుకు register అనే బటన్ నొక్కాలి. 

Step 6) మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ అనే బటన్ నొక్కగానే మీకు సమీపంలోని అన్ని వ్యాక్సినేషన్ సెంటర్స్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అందులో ఏదో ఒక సెంటర్‌ని సెలెక్ట్ చేసుకుని మీకు వీలైన డేట్, టైమ్ షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల COVID-19 vaccine కోసం ఇచ్చిన తేదీ, సమయం కుదరకపోయినట్టయితే.. అవసరమైతే మీ అపాయింట్‌మెంట్‌ని రీషెడ్యూల్ చేసుకునేందుకు కోవిన్ పోర్టల్ వీలు కల్పిస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు.

Step 7) ఒకే లాగిన్‌తో నలుగురికి వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.

Also read : COVID-19 vaccine తీసుకునే ముందు, తర్వాత ఎలాంటి Foods తినాలి ? ఏవి తినొద్దు ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News