Mohini Ekadashi 2023: జ్యోతిష్య శాస్త్రంలో ఏకాదశులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అన్నింటి కంటే మోహిని ఏకాదశి చాలా పవిత్రమైనది. ఈ రోజు పలు నియమాలతో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కాకుండా మోహిని ఏకాదశి రోజున ఉపవాసాలు పాటించడం ఆనవాయితిగా వస్తోంది. ఈ ఏకాదశి రోజు ఉపవాసాలు పాటించి పూజా కార్యక్రమాలంలో పాల్గొంటే అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అన్ని జన్మల పాపాలు కూడా నశిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంవత్సరం మోహినీ ఏకాదశి మే 1వ తేదిన రాబోతోంది. ఈ రోజు ఎలాంటి నియమాలతో పూజ కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మోహినీ ఏకాదశి ప్రాముఖ్యత:
సముద్ర మథనం జరిగినప్పుడు అమృతం లభించిన తర్వాత దేవతలు, రాక్షసుల మధ్య పెద్ద యుద్ధం ఏర్పడుతుంది. అసురులు తమ శక్తి బలంతో దేవతల కంటే శక్తివంతులువుతారు. దేవతలు అందరూ అసురులను ఓడించలేకతారు. ఇదే క్రమంలో విష్ణువు మోహినీ రూపాన్ని ధరించి రాక్షసులను బంధిస్తాడు. ఇలా వారి నుంచి అమృతాన్ని తీసుకుని దేవతలకు పంచుతారని పురాణాల నుంచి కథల రూపంలో వస్తోంది. అందుకే ఈ ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు.
Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?
మోహినీ ఏకాదశి ఉపవాస కథ:
పురాణాల ప్రకారం.. భద్రావతి అనే అందమైన నగరంలో ఒక ధనవంతుడు ఉండేవాడట.. స్వతహాగా ఎంతో భక్తిపరుడు, దానధర్మాలు చేసేవాడు. అతని కుటుంబం కూడా ఉండేది. ఆతని ఐదుగురు కుమారులు ఉండేవారు. వారిలో చిన్న కొడుకు పేరు ధృష్టబుద్ధి..ఈ చిన్న కుమారుడు చెడు పనులలో మునిగి తన తండ్రి సంపదను దోచుకునేవాడు. ఒకరోజు ధనపాల్ తన చెడు అలవాట్లతో విసిగిపోయి ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. దీంతో ధృష్టబుద్ధి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో ఆతను రాత్రి పగలు లేకుండా ఖాళీ నడక నడుస్తూ..మహర్షి కౌండిల్య ఆశ్రమానికి చేరుకుంటాడు.
కౌండిల్య ఆశ్రమంలో నది ఉంటుంది. ప్రతి రోజు మహర్షి గంగానది స్నానం చేస్తాడు. ధృష్టబుద్ధి దుఃఖ భారంతో బాధపడుతూ కౌండిల్య ఋషి వద్దకు వెళ్లి కరుణించమని కోరుతాడు. దీంతో మహర్షి మోహినీ ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని సలహా ఇస్తాడు. ఇలా ఉపవాసాన్ని పాటించేందుకు ధృష్టబుద్ధి కూడా ఒప్పుకుంటాడు. మహర్షి చెప్పిన పద్ధతి ప్రకారం ఉపవాసం చేస్తాడు. అప్పుడు ధృష్టబుద్ధి దేవతల అనుగ్రహం లభించి అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook