Pawan Kalyan Latest: ఢిల్లీలో పవన్ పవర్ గేమ్.. జనసేనాని టూర్‌పై బాబు ఆరా..?

Pawan Kalyan Latest: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తరుచూ ఢిల్లీ ఎందుకు వెళుతున్నట్లు..? పవనే ఢిల్లీ వెళుతున్నారా...? లేక పవన్ ను ఢిల్లీ పెద్దలు పిలిపిస్తున్నారా..? పవన్ వరుస ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న మతలబు ఏంటి..? పవన్ తో బీజేపీ రహస్య పొలిటికల్ ఎజెండా ఏదైనా నడుపుతుందా..? ఏపీకీ సంబంధించిన విషయాలు సీఎం చంద్రబాబుతో కాకుండా పవన్ తో చర్చించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..? 

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Nov 26, 2024, 03:05 PM IST
Pawan Kalyan Latest: ఢిల్లీలో పవన్ పవర్ గేమ్.. జనసేనాని టూర్‌పై బాబు ఆరా..?

Pawan Kalyan Latest: ఏపీ డిప్యూటీ సీఎం తరుచూ ఢిల్లీ వెళుతుండడంపై ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. గత 15 రోజుల్లో ఢిల్లీకీ రెండు సార్లు పవన్ ఢిల్లీ కీ వెళ్లారు. ఢిల్లీలో పవన్ బీజేపీ పెద్దలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఢిల్లీ పెద్దలతో జనసేనాని ఏమి చర్చలు జరుపుతున్నారని ఏపీలో ఆసక్తి నెలకొంది. మొన్నటి ఏపీ ఎన్నికల తర్వాత జనసేనాని క్రేజ్ అమాంతం పెరిగింది. తాను పోటీచేసిన అన్ని చోట్ల ఘన విజయం సాధించి జనసేన రికార్డు సృష్టించింది. ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ దే ప్రధాన పాత్ర అని బీజేపీ గట్టిగా విశ్వసిస్తుంది. అప్పటి నుంచి పవన్ తో బీజేపీ అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుంది. ఎన్డీయే కూటమిలో ఉన్న పార్టీల్లో బీజేపీకీ అత్యంత ప్రాధాన్యత కలిగిన పార్టీగా జనసేన మారింది.జనసేనాని రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ గా బీజేపీ భావిస్తుంది. అందుకే ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా పవన్ సేవలు వాడుకోవడానికి బీజేపీ రెడీ అవుతుంది.

తాజాగా జరిగిన మహా రాష్ట్ర ఎన్నికల్లో పవన్ బీజేపీకీ ప్రచారం నిర్వహించారు. పవన్ ప్రచారం చేసిన చోట బీజేపీ ఘన విజయం సాధించింది. మహారాష్ట్రలో పవన్ ప్రచారం ఎంతో కీలకంగా మారింది. దీంతో పవన్ పై బీజేపీకీ మరింత నమ్మకం పెరిగింది. పవన్ లాంటి మిత్రుడిని రాజకీయంగా  మరింత వాడుకుంటే బాగుంటదనే భావనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే బీజేపీ పవన్ కళ్యాణ్‌ కు ప్రత్యేక టాస్క్ అప్పజెప్పుతున్నట్లు ఢిల్లీ సర్కిల్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా  ఉన్న పవన్ కళ్యాణ్‌ ఫ్యచర్ లో ఏపీలో కూడా మరింత కీలక పాత్ర పోషిస్తారనే ప్రచారం జరుగుతుంది.

అంతేకాదు ఏపీ అభివృద్ధిలో పవన్ ప్రముఖ పాత్ర ఉండబోతుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పవన్ చొరవతోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు నిధులు కేటాయించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.అంతే కాదు ఏపీకీ సంబంధించిన పెండింగ్ పనులను చకచకా క్లియర్ చేయాలని కేంద్రం మంత్రులను మోదీ అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తుంది. పవన్ నుంచి ఎలాంటి విజ్నప్తులు వచ్చినా వెంటనే వాటిని వీలైనంత త్వరంగా పరిష్కరించాలిని ఇప్పటికే  కేంద్ర పెద్దల నుంచి ఆయా శాఖలకు ఆదేశాలు వెళ్లినట్లు కూడా ఢిల్లీలో చర్చ జరగుతుంది. తాజగా పవన్ ఢిల్లీ పర్యటనలో కొందరు కేంద్ర మంత్రులను కలిశారు. వారికి ఏపీకీ సంబంధించిన కేంద్రం మంత్రులకు పలు ప్రతిపాదనలు అందించారు .దీంతో ఏపీ అభివృద్ధి విషయంల పవన్ చాలా సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఏపీ అభివృద్ధిని తన భుజాల మీద వేసుకున్నట్లు తెలుస్తుంది. 

ఐతే పవన్ ఉన్నట్లుండి అమాంతంగా ప్రతి సారీ ఢిల్లీ వెళుతుండడంపై ఏపీ రాజకీయాల్లో కూడా ఆసక్తికర చర్చ జరగుతుంది. పవన్ పదే పదే ఢిల్లీ ఎందుకు వెళుతున్నట్లు..? పవన్ ను బీజేపీ పెద్దలు ఢిల్లీ పిలిపించుకోవడానికి కారణాలు ఏంటనే దానిపై టీడీపీ వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. ఏదో ఒక సారి ఢిల్లీకీ వెళ్లాడంటే టీడీపీ లైట్ గా తీసుకునేది కానీ గత పదిహేను రోజుల్లో రెండో సారి ఢిల్లీకీ వెళ్లడంపై మాత్రం టీడీపీ చాలా సీరియస్ గానే వాకబు చేస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ ఒక నజర్ వేసి నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంతే కాదు పవన్ ఢిల్లీ పర్యటనపై ఇంటలిజెన్స్ సమాచారాన్ని కూడా సేకరిస్తున్నట్లు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది.గత పర్యటనలో హోం మంత్రి అమిత్ షా భేటీ ఐన జనసేనాని ఈ సారి మోదీతో భేటీ కావడం సంచలనంగా మారింది. ఈ భేటీల వెనుక ఉన్న ఎజెండా ఏంటో మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు.

ఐతే జనసేన వర్గాలు మాత్రం పవన్ పర్యటనపై మరోలా స్పందిస్తున్నాయి.మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తరుపున పవన్ ప్రచారం నిర్వహించారు. అంతే కాదు పవన్ ప్రచారం చేసిన చోట బీజేపీ విజయం సాదించింది. పవన్ ను అభినందించడానికే ఢిల్లీ పిలిపించినట్లు వారు చెబుతున్నారు. త్వరలో మహారాష్ట్రలో కొలువు దీరే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వనించినట్లుగా వారు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్‌ ను బీజేపీ కేవలం ఏపీకీ పరిమితమైన నేతగా చూడడం లేదని ప్రస్తుతం దక్షిణాదిన అత్యంత ప్రభావిత నేతల్లో పవన్ ను ఒకరుగా చూస్తున్నారని జనసైనికులు చెబుతున్నారు. ఫ్యూచర్ లో దక్షిణాదిన పవన్ తిరుగులేని నేతగా ఎదుగుతారని జనసైనికులు తెగ నమ్మకంగా చెబుతున్నారు. పవన్ లాంటి వ్యక్తి కోసం ఏకంగా బీజేపీ పెద్దలే రంగంలోకి దిగడం తమకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుందని చెబుతున్నారు. ప్రదానీ మోదీ, అమిత్ షా లాంటి పవన్ నిత్యం టచ్ లో ఉండడమే అంటేనే పవన్ ప్రాదాన్యత ఏంటో అర్థం చేసుకోవాలని వారు అంటున్నారు.

మొత్తానికి పవర్ స్టార్ పవన్ పదే పదే ఢిల్లీ వెళుతుండంపై మాత్రం అనేక అనుమానాలు ఉన్నాయి. భేటీలో పవన్ తో బీజేపీ పెద్దలు ఏం చర్చిస్తున్నారు..? పవన్ తో బీజేపీ చర్చిస్తుంది ఏపీకీ సంబంధించిన అంశాలా లేక ఇతరత్రా రాజకీయ అంశాలా అన్నది మాత్రం తెలియడం లేదు. ఈ అంశాలు తేలాలంటే మాత్రం పవన్ కళ్యాణ్‌ లేదా బీజేపీ పెద్దలు మాత్రమే స్పందించాల్సి ఉంది. 

Also Read: KTR Vs Cm Revanth Reddy: నీలాగా లుచ్ఛా పనులు అలవాటు లేదు.. సీఎం రేవంత్‌పై మరోసారి నిప్పులు చెరిగిన కేటీఆర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News