Bigg Boss 8 Telugu Grand Finale: బిగ్ బాస్ పేరుతో రోడ్డెక్కితే తోలు తీస్తాం.. నాగ్ కు ఇండైరెక్ట్ వార్నింగ్..

Bigg Boss 8 Telugu Grand Finale: నాగార్జున అక్కినేని  హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే జరగుతోంది. సీజన్ 8లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.  గతంలో బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో తదితర ప్రదేశాల్లో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకొని సిటీ పోలీసులు బిగ్ బాస్ షో ప్రేమికులకు హెచ్చరికలు జారీ చేశారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 15, 2024, 08:07 PM IST
Bigg Boss 8 Telugu Grand Finale: బిగ్ బాస్ పేరుతో రోడ్డెక్కితే తోలు తీస్తాం.. నాగ్ కు ఇండైరెక్ట్ వార్నింగ్..

Bigg Boss 8 Telugu Grand Finale: బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ పోరు  జరగుతోంది. ఈ నేప థ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి గొడవలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దీంతో జూబ్లీహిల్స్ లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలోని బిగ్ బాస్ హౌస్ వద్ద దాదాపు 300 మంది పోలీసులతో భారీ బందో బస్తు ఏర్పాటు చేసినట్లు.. జూబ్లీహిల్స్ ఇన్స్ పెక్టర్ వేంకటేశ్వర రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తెలిపారు.

గత ఏడాది సీజన్ 7 ఫైనల్ లో జరిగిన ప్రమాదం లాంటివి జరగకూడదని ఈ సారి ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 ముగింపుకు చేరుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఐదుగురు కంటెస్టెంట్ మాత్రమే ఉన్నారు.  నిఖిల్, నబీల్, గౌతమ్, అవినాష్, ప్రేరణ ఉన్నారు. ఇవాళ్టితో ఈ షో కు ఎండ్ కార్డ్ పడనుంది. మరికాసేపట్లో విజేతను ప్రకటించనున్నారు.

పైగా నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వానికి అంతగా సఖ్యత లేదు. మరోవైపు పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిల మృతి చెందడం వంటి ఘటనలు తెలంగాణ పోలీసులు మరియు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. వారి నిర్లక్ష్యం వల్ల జరిగిన వాటిని వేరే వాళ్ల మీద నెట్టేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రజలు, సినిమా నటులు ప్రభుత్వానికి టాక్సులు రూపేణా చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది.

ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతేడాది పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత స్టూడియో నుంచి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో అభిమానుల అత్యుత్సాహంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఈ సారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జూబ్లీహిల్స్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..

ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News