రూ.51 కోట్ల భారీ విరాళం ప్రకటించిన BCCI

కరోనావైరస్ (Coronavirus attack) దాడి కారణంగా తలెత్తిన ఊహించని విపత్తును ఎదుర్కునేందుకు కేంద్రం చేస్తోన్న పోరాటానికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి భారీ మొత్తంలో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

Last Updated : Mar 29, 2020, 01:11 AM IST
రూ.51 కోట్ల భారీ విరాళం ప్రకటించిన BCCI

కరోనావైరస్ (Coronavirus attack) దాడి కారణంగా తలెత్తిన ఊహించని విపత్తును ఎదుర్కునేందుకు కేంద్రం చేస్తోన్న పోరాటానికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి భారీ మొత్తంలో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పీఎం-కేర్ ఫండ్‌కి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రూ.25 కోట్లు (Akshay Kumar`s donation) అందివ్వనున్నట్టు ప్రకటించగా తాజాగా బీసీసీఐ (BCCI) సైతం భారత ప్రభుత్వానికి తమ వంతు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్వేషన్స్ ఫండ్‌కి (PM's CARES Fund) బీసీసీఐ రూ.51 కోట్లు విరాళంగా అందించనున్నట్టు (BCCI donates Rs 51 cr) ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యవసర విపత్కర పరిస్థితుల్లో పౌరుల సహాయార్థం ఉపయోగించే నిధికి ఈ మొత్తాన్ని అందించనున్నట్టు బీసీసీఐ స్పష్టంచేసింది. 

Read also : లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు.. వలసదారులకు గుడ్ న్యూస్

బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ (Sourav Ganguly), గౌరవ కార్యదర్శి జే షా (Jay Shah), ఇతర కార్యవర్గసభ్యులతో పాటు బీసీసీఐకి (BCCI) అనుబంధంగా పనిచేసే అన్ని రాష్ట్రాల అసోసియేషన్స్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనావైరస్ (COVID-19)ని కట్టడి చేసేందుకు కేంద్రం చేస్తోన్న కృషికి తోడ్పాటును అందించేందుకు ఇప్పటివరకు పీఎం కేర్స్ ఫండ్‌కి అందిన అతి పెద్ది విరాళం ఇదే కానుంది. ఆ తర్వాత సినీ నటుడు అక్షయ్ కుమార్‌దే కావడం విశేషం. అయితే, అక్షయ్ కుమార్ ఒక వ్యక్తిగానే ఇంత భారీ మొత్తాన్ని విరాళంగా అందివ్వడం ఇక్కడ మరింత అభినందించదగిన విషయం అని పలువురు అక్కీ సేవాభావాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News