AP: రాష్ట్రంలో పాల రాజకీయం, హెరిటేజ్ వర్సెస్ అమూల్ ప్రాజెక్టు

AP: ఏపీలో పాల రాజకీయం మొదలైంది. అమూల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం ఆరోపణలు చేస్తోంది. ఇతర డైరీల్ని నిరసనకు సిద్ధం చేస్తోంది. హెరిటేజ్‌ను దెబ్బ తీసేందుకేననేది టీడీపీ వర్గీయులు చెబుతున్న మాట.

Last Updated : Dec 6, 2020, 10:40 PM IST
  • ఏపీలో ప్రారంభమైన పాల రాజకీయాలు
  • అమూల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా హెరిటేజ్, సంగం డైయిరీ సంస్థల నిరసన
  • పాడి రైతులకు లాభం చేకూర్చేందుకేనని ప్రభుత్వ వాదన
AP: రాష్ట్రంలో పాల రాజకీయం, హెరిటేజ్ వర్సెస్ అమూల్ ప్రాజెక్టు

AP: ఏపీలో పాల రాజకీయం మొదలైంది. అమూల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం ఆరోపణలు చేస్తోంది. ఇతర డైరీల్ని నిరసనకు సిద్ధం చేస్తోంది. హెరిటేజ్‌ను దెబ్బ తీసేందుకేననేది టీడీపీ వర్గీయులు చెబుతున్న మాట.

ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh )‌లో ఇటీవల ప్రారంభమైన అమూల్ ప్రాజెక్టు ( Amul project ) ఇప్పుడు కొత్త వివాదానికి దారి తీస్తోంది. అమూల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా  సహకార డైయిరీలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు..దీని వెనుక టీడీపీ వర్గీయలు హస్తమున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో పాల రాజకీయం ప్రారంభమైందిప్పుడు. పాడి రైతులకు మేలు చేసే ఉద్దేశ్యం కాకుండా కొందర్ని టార్గెట్ చేయడానికే అమూల్ ప్రాజెక్టు తీసుకొచ్చిందనేది టీడీపీ వర్గీయుల వాదన.

ఎందుకంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ( Chandrababu naidu ) సొంత కంపెనీ హెరిటేజ్. ఇదే ఇప్పుడు అమూల్‌కు వ్యతిరేకంగా వివాదానికి కారణమైంది. పాడి రైతులకు లబ్ది చేకూరుస్తున్నామనేది ప్రభుత్వం చెబుతున్న మాట. రాష్ట్రంలోని పాడి రైతుల వినియోగం పూర్తయ్యాక కూడా దాదాపుగా రెండు కోట్ల లీటర్లకు పైగా పాల మిగులు మార్కెట్‌లో ఉందని ప్రభుత్వం చెబుతోంది. అమూల్ ప్రాజెక్టు వల్ల పాల మార్కెట్‌లో పోటీ పెరిగి..రైతులకు లాభం చేకూరుతుందని ప్రభుత్వం అంటోంది. 

అయితే ఇదంతా కట్టుకధ మాత్రమేనని..చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ( Heritage ), ఇతర టీడీపీ వర్గీయుల డైయిరీలపై కక్ష్య సాధింపు చర్యేనని కొంతమంది వాదన చేస్తున్నారు. అమూల్ సంస్థ గుజరాత్ రైతులకు ఇచ్చే ధరకు..ఏపీ రైతులకు ఇచ్చే ధరకు తేడా ఉందని అంటున్నారు. Also read: AP: వ్యవసాయబిల్లుకు వైసీపీ మద్దతుకు కారణమిదే..

Trending News