AP CM YS Jagan Mohan Reddy Launches AP Fact Check Website: ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్‌ను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్రంలో మీడియా, సోషల్ మీడియాలలో పోస్ట్ అయ్యే దుష్ప్రచారాన్ని పసిగట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్వేషాలు రెచ్చగొట్టడం, దురుద్దేశ పూరిత విషయాలు, అసత్యాలు ప్రచారం లాంటివి నియంత్రించడంలో భాగంగా ఏపీ ఫ్యాక్ట్ చెక్ ప్రారంభించారు.
ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ప్రారంభించిన అనంతరం శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్(AP CM YS Jagan) మీడియాతో మాట్లాడారు. తప్పుడు ప్రచారాన్ని ఈ వెబ్సైట్ ద్వారా ఏపీ ప్రభుత్వం ఖండిస్తుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వీటికి అడ్డుకట్ట వేస్తూ ఆధారాలతో ఏపీ ప్రభుత్వం ఖండిస్తుందన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను, పథకాల వివరాలు, రాష్ట్రంలో ఏదైనా దుష్ప్రచారం జరిగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
Also Read: AP Municipal Elections 2021: ఏపీ ఎస్ఈసీ Nimmagadda Ramesh Kumar ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
సమాచార వ్యవస్థను తప్పుదోవ పట్టించడం సరికాదని సూచించారు. ప్రజలకు వాస్తవాలు తెలపడం, అబద్ధం ఏంటన్నది చూపించడమే ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ముఖ్య ఉద్దేశమని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివరించారు. అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయడం ప్రజలకు సైతం మేలు చేస్తుందని చెప్పారు.
కాగా, ఏపీలో పురపాలక ఎన్నికల(AP Municipal Elections 2021)లో గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలు నిషేధిస్తూ విధించిన ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు నిలిపివేసింది. పంచాయతీ ఎన్నికల్లో సైతం గ్రామ వాలంటీర్లపై చాలా ఫిర్యాదు వచ్చాయని, వారిని మున్సిపల్ ఎన్నికల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని భావించిన ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ వాలంటీర్ల సేవలు అందించకూడదని ఆంక్షలు విదించారు. ఓటర్ స్లిప్పుల పంపకం, ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయడం లాంటివి చేయకుండా ఉండేందుకు, వారి ఫోన్లను సైతం స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలలో పేర్కొన్నారు.
Also Read: EPF Interest Rate: EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త, 6 కోట్ల మంది హర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook