/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Covid19 Instructions: కరోనా సంక్రమణ, కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు కఠినమైన సూచనలు జారీ చేసింది. తీసుకోవల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారుల్ని ఆదేశించారు.

కరోనా సంక్రమణ(Corona Spread) నెమ్మదిగా పెరుగుతోంది. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై..రాష్ట్రంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధుల ఆరోగ్యంపై దృష్టి సారించింది. విద్యార్ధులు కోవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులకు ఆదేశించారు. ఆగస్టు 16వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైన నేపద్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్( Adimulapu Suresh) సమీక్ష నిర్వహించారు. విద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖాధికారులతో సమీక్ష జరిపిన మంత్రి ఆదిమూలపు సురేష్ పలు సూచనలు జారీ చేశారు. కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయి..వ్యాక్సిన్ వేయించుకున్న ఉపాధ్యాయలు వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. 

ఇప్పటికే రాష్ట్రంలో 97.5 శాతం ఉపాధ్యాయలు వ్యాక్సిన్ (Covid Vaccine)వేయించుకున్నారు. మిగిలిన 7 వేల 388 మందికి వ్యాక్సిన్ అందించే చర్యలు తీసుకోవాలని మంత్రి సురేష్ తెలిపారు. వందమందికి ఒకేసారి వ్యాక్సిన్ వేసేందుకు ఎక్కడ ప్రతిపాదిస్తే అక్కడే వ్యాక్సిన్ వేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. పాఠశాలల్లో విద్యార్ధులు భౌతికదూరం పాటించగలిగితే చాలావరకు కరోనా సంక్రమణను అడ్డుకోవచ్చని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తప్పకుండా పాటించాలని ఆదేశించారు. విశ్వ విద్యాలయాలు, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్ధులు, సిబ్బందికి వ్యాక్సిన్ అందించాలని ఆదేశించారు. ఏపీలో గత 24 గంటల్లో 1439 కొత్త కేసులు నమోదయ్యాయి. అటు 14 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 కోట్ల 71 లక్షల 61 వేల 870 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests)చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 19 లక్షల 97 వేల 454 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో ఏపీలో 1311 మంది కోలుకున్నారు. 

Also read: Polavaram Project Update: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఏ దశలో ఉందో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Ap education minister adimulapu suresh strict orders to schools and colleges to follow covid guidelines
News Source: 
Home Title: 

Covid19 Instructions: రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు మంత్రి ఆదిమూలపు సురేష్ కఠిన ఆ

Covid19 Instructions: రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు మంత్రి ఆదిమూలపు సురేష్ కఠిన ఆదేశాలు
Caption: 
Adimulapu Suresh ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

పాఠశాలలు, కళాశాలల్లో కరోనా నిబంధనలపై కఠిన సూచనలు

కరోనా పరిస్థితులపై సమీక్షించిన మంత్రి ఆదిమూలపు సురేష్

కళాశాల విద్యార్ధులకు కూడా వ్యాక్సినేషన్‌కు ఆదేశాలు

Mobile Title: 
Covid19 Instructions: రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు మంత్రి ఆదిమూలపు సురేష్ కఠిన ఆ
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Thursday, September 9, 2021 - 19:43
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
70
Is Breaking News: 
No