/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Minister Peddireddy reaction on withdrawl of Three Capital Bill: మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించడం సంచలనంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) దీనిపై అసెంబ్లీలో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) మినహా మిగతా మంత్రులెవరూ దీనిపై స్పందించలేదు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని... శుభం కార్డుకు మరింత సమయం ఉందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

వికేంద్రీకరణ బిల్లు, సీర్ఢీఏ రద్దు బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అమరావతి రైతుల (Amaravati farmers) విజయమేమీ కాదని పెద్దిరెడ్డి అన్నారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో (AP High Court) అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు. తాను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. అమరావతి రైతుల పాదయాత్ర చూసి ప్రభుత్వం బిల్లులు ఉపసంహరించుకోలేదని అన్నారు. అది పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర అని విమర్శించారు. ఆ పాదయాత్ర ఏమైనా లక్షల మందితో సాగుతోందా అని ప్రశ్నించారు.

Also Read: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మూడు రాజధానుల బిల్లు రద్దుకు నిర్ణయం

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుపై (AP Three Capital Bill) హైకోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీటన్నింటిపై రోజు వారీ విచారణ జరుగుతోంది. కోర్టు పరిధిలో ఉన్న అంశం కావడంతో ప్రభుత్వం దీనిపై ముందుకెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు అమరావతి రైతులు మూడు రాజధానుల రద్దుకు దాదాపు ఏడాది కాలంగా ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లును ఉపసంహరించుకోవడమంటే... తిరిగి రాజధానిగా అమరావతినే కొనసాగిస్తారా... లేక పెద్దిరెడ్డి చెప్పినట్లు మూడు రాజధానుల విషయంలో టెక్నికల్‌గా ఎదురవుతున్న సమస్యలను సరిదిద్దేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నది తేలాల్సి ఉంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ (CM YS Jagan) ప్రకటన తర్వాత ఈ విషయాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
not a victory of amaravati farmers minister peddireddy reaction over withdrawl of three capital bill
News Source: 
Home Title: 

'ఇది అమరావతి రైతుల విజయం కాదు.. నేను ఇప్పటికీ 3 రాజధానులకే కట్టుబడి ఉన్నా'

 ఇది అమరావతి రైతుల విజయం కాదు-నేను ఇప్పటికీ 3 రాజధానులకే కట్టుబడి ఉన్నా : మంత్రి పెద్దిరెడ్డి
Caption: 
File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి రియాక్షన్
ఇది అమరావతి రైతుల విజయమేమీ కాదన్న మంత్రి
తాను మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని కామెంట్ 

Mobile Title: 
'ఇది అమరావతి రైతుల విజయం కాదు.. నేను ఇప్పటికీ 3 రాజధానులకే కట్టుబడి ఉన్నా'
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, November 22, 2021 - 14:18
Request Count: 
65
Is Breaking News: 
No