Eat Mango's for Weight Loss: పండ్లల్లో రారాజు.. మామిడి పండు అన్న విషయం తెలిసిందే. వేసవి కాలం వచ్చిందంటే మనకు అందుబాటులో ఉండే మామిడి పండ్లను చిన్నా, పెద్దా లేకుండా చాలా మంది ఎంతో ఇష్టంతో తింటారు. అయితే కొందరు మాత్రం మామిడి పండ్లను తినేందుకు భయపడతారు. ఎందుకంటే.. వేడి చేస్తుందని, బరువు పెరుగుతామని. అయితే మామిడి పండ్లను తినడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవడంతో పాటు బరువు కూడా సునాయాసంగా తగ్గవచ్చట. మామిడిని ఎప్పుడు, ఎలా తినాలో ఓసారి చూద్దాం.
మామిడిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయని, దాంతో బరువు పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది అస్సలు నిజం కాదు. మామిడి కాయ లేదా పండులో ఫైబర్, విటమిన్ సి, కాపర్, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం.. విటమిన్ ఏ, ఈ, బీ5, కే, బీ6 వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. మామిడిలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు.. ఫైటోకెమికల్స్ కొవ్వుతో సంబంధం ఉన్న జన్యువులను నివారిస్తాయి. దాంతో శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు తగ్గుతుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లను ఎక్కువగా తినకూడదు.
మామిడి పండు పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని తింటే మీ బరువు పెరగదు. బరువు తగ్గాలనుకునే నేరుగా కాకుండా జ్యూస్ లేదా షేక్ చేసుకుని తీసుకోవాలి. ఒక రోజులో ఒకటి కంటే ఎక్కువ మామిడి పండును తినకూడదు. ఆహారంతో పాటుగా మామిడిని ఎప్పుడూ తినకూడదు. భోజనానికి ముందు కానీ లేదా అల్పాహారంలో తొనొచ్చు. మధ్యాహ్నం లేదా స్నాక్స్‌లా మాత్రమే తీసుకోవాలి. ఇక దుకాణంలో కొనుగోలు చేసిన మామిడి రసాన్ని మాత్రం తీసుకోకూడదు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Aso Read: Sunil Gavaskar on DK: అలా జరగకపోతే అంతా ఆశ్చర్యమే..దినేష్ కార్తీక్‌పై గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Also Read: Sunset Time: సూర్యాస్తమయం వేళ ఆ పనులు చేస్తే..లక్ష్మీదేవికి ఆగ్రహం
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook