Danzer Virus: కొవిడ్ మహమ్మారి గత ముడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. రూపు మార్చుకుని పలు దఫాలుగా విజృంభించింది. భారత్ ను కొవిడ్ అతలాకుతలం చేసింది. ప్రస్తుతానికి దేశంలో కొవిడ్ తీవ్రత తగ్గినా.. పూర్తిగా భయం మాత్రం పోలేదు. కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే వెలుగులోనికి వచ్చిన మంకీ పాక్స్ ప్రపంచ దేశాలను కలవరపెట్టింది. పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు భారీగా నమోదయ్యాయి. మనదగ్గర మాత్రం ఆ వైరస్ పెద్దగా విస్తరించలేదు. తాజాగా దేశంలో మరో వైరస్ భయాందోళన కల్గిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోన్న అతి భయంకరమైన వైరస్ తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో రాష్ట్ర అధికారులు అలర్ట్ అయ్యారు.
కొన్ని రోజుల క్రితం విదేశాల్లో వెలుగుచూసిన లంపీ వైరస్ కేసులు ఇటీవలే మనదేశంలోని పలు రాష్ట్రాల్లో నమోదయ్యాయి. తెలుగులో ముద్ద చర్మ వ్యాధిగా పిలిచే లంపి స్కిన్ వైరస్ పశువలను ప్రాణాలు హరిస్తుంది. వేగంగా విస్తరిస్తూ భయంకరంగా మారిపోయింది. పశువులకు ప్రాణంతంగా మారిన లంపి వైరస్ తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చిందని అధికారులు చెబుతున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో 2, 3 లంపి అనుమానిత కేసులు బయటపడ్డాయి. దీంతో పశువైద్య శాఖ అప్రత్తమైంది. జిల్లాలోని అన్ని మండలాలను సమాచారం ఇచ్చింది. వ్యాధి ప్రభలకుండా చర్యలు చేపట్టింది.
పశువులకు అతి ప్రమాదకరమైన లంపి వైరస్ 1929లో మొదట జాంబియాలో బయటపడింది. పాలిచ్చే ఆవులు, గేదెలు, దూడలకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది.ఆఫ్రికా, ఆసియా, యూరోపియన్ దేశాలను వణికించిన ఈ వ్యాధి ఇండియావోకి ప్రవేశించింది. పాకిస్తాన్ ద్వారా లంపి వైరస్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిందని అధికారులు భావిస్తున్నారు. హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరఖండ్ లలో కేసులను గుర్తించారు. ఈ వ్యాధి సోకితే పశువలతల, మెడ, కాళ్లు, పొడుగు, పునరుత్పత్తి అవయవాలపై చర్మసంబంధ గడ్డలు వస్తాయి. బాడీపై దద్దర్లతో మొదలై గడ్డలుగా మారి పశువులకు నొప్పిని కలిగిస్తాయి. కొన్ని రోజులకు ఈ గడ్డలు పగిలి అల్సర్ లుగా మారి చర్మం ఊడిపోతుంది.
దీంతో పశువుల తోలు పనికిరాకుండా పోయి చనిపోతుంటాయి.
లంపి స్కిన్ వైరస్ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువులను దగ్గరలోని పశు వైద్యశాలకు తీసుకుపోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఈడీటీఏలో రక్తం, చర్మ పొక్కులను సేకరించి పరీక్షిస్తే వ్యాధి నిర్దారణ అవుతుంది. జ్వరం, నొప్పి, జలుబు నివారణకు పెన్సిలిన్ ఇస్తారు. యాంటీబయాటిక్ మందులు 5 నుండి 7 రోజులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన పశువును మంద నుంచి వెంటనే వేరు చేయాలి. లేదంటే మిగితా పశువులకు వ్యాపిస్తుంది. లంపి వైరస్ తో చనిపోయిన పశువులను లోతైన గుంతలో పూడ్చాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Khammam Trs War: ఖమ్మం టీఆర్ఎస్ లో ముదిరిన ముసలం.. మంత్రికే ఊడిగం చేయాలంటూ ఊగిపోయిన ఎంపీలు
Also Read: SBI: ఇకపై ఎస్ఎంఎస్ ఛార్జీలు ఉండవు..ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్‌న్యూస్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok