Pawan Kalyan Puja For Varahi: దుర్గమ్మ దర్శనం.. వారాహికి వాహన పూజ

Pawan Kalyan's Vahana Puja For Varahi: దుర్గ గుడిలో వారాహికి వాహన పూజలు, అమ్మవారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వెళ్తారు. పార్టీ ఆఫీసులో షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటల నుంచి 'ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో వైసీపీ సర్కార్ నిర్లక్షం' అంశంపై చర్చా కార్యక్రమం ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2023, 12:32 AM IST
Pawan Kalyan Puja For Varahi: దుర్గమ్మ దర్శనం.. వారాహికి వాహన పూజ

Pawan Kalyan's Vahana Puja For Varahi: మంగళవారం తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి వాహన పూజ చేయించిన పవన్ కళ్యాణ్.. బుధవారం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోనున్నారు.  ఉదయం 8 గంటలకు అమ్మ వారిని దర్శనం చేసుకున్న అనంతరం వారాహి వాహనానికి జరిగే వాహన పూజలో పాల్గొంటారు. ఈ మేరకు జనసేన పార్టీ వర్గాలు దుర్గ గుడి దేవాలయం బోర్డు అధికారులకు సమాచారం అందించారు.

దుర్గ గుడిలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు, అమ్మవారి దర్శనం అనంతరం నేరుగా పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వెళ్తారు. పార్టీ ఆఫీసులో షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటల నుంచి 'ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో వైసీపీ సర్కార్ నిర్లక్షం' అంశంపై చర్చా కార్యక్రమం ఉంటుంది. 

జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొని ఏపీలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేన పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలతో పాటు సామాజిక ప్రముఖులను ఈ చర్చా కార్యక్రమానికి అతిథులుగా ఆహ్వానించారు.

ఇది కూడా చదవండి : Pawan Kalyan's Fan Death News: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. అభిమాని మృతి, ముగ్గురికి గాయాలు

ఇది కూడా చదవండి : Varahi Vehicle: కొండగట్టు ఆంజనేయుని సన్నిధిలో వారాహికి పవన్ పూజలు

ఇది కూడా చదవండి : Mammootty in PSPK Film: పవన్ కళ్యాణ్ సినిమాలో మమ్ముట్టికి విలన్ పాత్ర.. ఏమైందో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News