Coronavirus: కరోనావైరస్ ఏడాది కాలం నుంచి ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ వైరస్ వల్ల ప్రభావితం అయ్యారు. తమకు వ్యాక్సిన్ ఎప్పుడు లభిస్తుందా అని అని భూమిపై ఉన్న ప్రతీ వ్యక్తి ఎదరుచూస్తున్నాడు. కొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రారంభం అయింది కూడా.
ALSO READ | Doppelgänger: మనుషులను పోలిన మనుషులు అంటాం కదా.. వీళ్లే వాళ్లు..
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 (Covid-19) వ్యాక్సిన్‌పై ప్రజలు పెట్టుకున్న ఆశలకు ప్రతీ రూపంగా.. వ్యాక్సిన్ అందరికీ లభిస్తుంది అని చాటుతూ ఒక పైలెట్ వినూత్న ప్రయత్నం చేశాడు. జర్మనీకి చెందిన సామీ క్రామెర్ అనే పైలెట్న ఆకాశాలో వ్యాక్సిన్ ఆకారం అయిన రూట్‌లో ప్రయాణించాడు. టీకా అందుబాటులోకి వచ్చిన శుభ సందర్భంగా ఇలా చేశాడు సామి.
ALSO READ| Mukesh Ambani Facts: ముఖేష్ అంబానీ నిమిషానికి 23 లక్షలు సంపాదిస్తాడు తెలుసా ?
దీని కోసం క్రేమర్ సుమారు 200 కిలోమీటర్ల ప్రయాణాన్ని చిన్న తెల్ల, బ్లూ డైమండ్ DA20 సింగిల్ ప్రాపెల్లర్ ప్లేన్‌ను వినియోగించాడు. తన రూటు టీకా (Coronavirus Vaccine) ఆకారంలో ఉండేందుకు సుమారు 5,000 వేల అడుగుల ఎత్తులో..70 కిలో మీటర్ల సర్కిల్ ఏరియాలో ప్రయాణించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe