Vishwaroop Comments: కోనసీమ జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న ఆందోళనకారుల నిరసన హింసాత్మకంగా మారడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది.
Taneti Vanitha comments: కోనసీమ జిల్లాలో అలజడి కొనసాగుతోంది. జిల్లా పేరును మార్చొద్దంటూ జరిగిన నిరసన నిన్న హింసాత్మకంగా మారింది. మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆయన ఇల్లు ధ్వంసమైంది. ఆర్టీసీ బస్సులు దగ్ధమైయ్యాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
AP Govt: విశాఖ రుషి కొండ తవ్వకాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఇదివరకే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
Konaseema: ప్రకృతి అందాలతో ఎప్పుడూ కళకళలాడే కోన సీమ..ఆందోళనలతో అట్టుడుకుతోంది. పరిస్థితి చేయి దాటిపోకుండా పోలీసులు అప్రమత్తమైయ్యారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
Intelligence Alert: భారత్‌లో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నుతున్నాయి. ఈ విషయాన్ని నిఘా విభాగాలు స్పష్టం చేశాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి
CM Jagan Tour: దావోస్‌లో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా టూర్‌ను కొనసాగిస్తున్నారు. రెండురోజూ కూడా పలువురు పారిశ్రామిక వేత్తలతో ఆయన సమావేశమవుతారని సీఎంవో అధికారులు తెలిపారు.
CM Jagan Tour: నవ్యాంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం జగన్ దావోస్ పర్యటన కొనసాగుతోంది. పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం జగన్ బృందం భేటీ అవుతోంది. రాష్ట్ర పరిస్థితులను వారికి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
Pawan Kalyan: పెట్రోల్,డీజిల్‌పై సుంకం పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఓవైపు హర్షం వ్యక్తమవుతుంటే..మరోవైపు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడే ఎందుకు తగ్గించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Jc Prabhakar Reddy: ఏపీలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. అధికార,విపక్షాలు నువ్వానేనా అన్నట్లు ప్రజల్లోకి వెళ్తున్నాయి. గడప గడపకు పాలన అంటూ వైసీపీ క్షేత్రస్థాయిలోకి వెళ్తోంది. ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాదుడే బాదుడు అంటూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
Jagga Reddy Comments:తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై రగడ కొనసాగుతోంది. దేని ఆధారంగా చేసుకుని అధికార పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేశాయని విపక్షాలు మండిపడుతున్నాయి.
Buggana on Yanamala: సీఎం జగన్.. దావోస్ పర్యటనపై విపక్షాల విమర్శలకు ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. ఇందులో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేసింది. కొందరూ కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ అయ్యారు.
Kiran Kumar Reddy: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలోపేతంపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టి పెట్టారు. రాష్ట్ర నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. తాజాగా సోనియా గాంధీతో ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు.
Lokesh Comments: ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అంశం రాజకీయ రచ్చకు దారి తీసింది. దీనిపై అధికార, విపక్ష పార్టీ నేతలు మాటల యుద్దానికి దిగారు. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
Pawan kalyan Tour: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. ఇప్పటివరకు ఏపీపై దృష్టి పెట్టిన ఆయన..ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ చేశారు. జనసైనికుల్లో జోష్ నింపేందుకు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ నల్గొండ జిల్లాలో పవన్ పర్యటించారు.
Somuveer Raju Letter: ఆంధ్రప్రదేశ్‌లో వరి అంశం మంటలు పుట్టిస్తోంది. దీనిపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ధాన్యం కొనుగోలు దోపిడీని అరికట్టాలని లేఖలో తెలిపారు.
Chandra Babu Comments: రాయలసీమ జిల్లాల్లో పాగా వేయాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు..ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారు. ఈక్రమంలో జిల్లాల పర్యటనలను వేగవంతం చేశారు. జగన్ ఇలాకాలో సమర శంఖం పూరించిన ఆయన..ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించారు. టూర్లో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
Jagan Kcr Deal: తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం ఏపీలోని మొత్తం నాలుగు సీట్లు అధికార వైసీపీకి దక్కనుండగా.. తెలంగాణలోని మూడు స్థానాలు టీఆర్ఎస్ పార్టీనే గెలుచుకోనుంది.
AP Govt: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సీనియర్ ఐపీఎస్‌లకు స్థాన చలనం కల్గించింది. ఐజీపీ స్పోర్ట్స్, సంక్షేమానికి ఎల్వీకే రంగారావు, ఆక్టోపస్ డీఐజీగా ఎస్వీ రాజశేఖర్ బాబు బదిలీ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.