BJP Changes: తెలంగాణ బీజేపీలో మార్పులు తధ్యమనే తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ విషయంపై హైప్ నెలకొన్నా అధిష్టానం మాత్రం పార్టీ బాధ్యతలు మరొకరికి అప్పగించే దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి.
Outer Ring Rail Project in Telangana: ఈనెల 8వ తేదీన వరంగల్ కు రానున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ తెలంగాణకు రానున్న నేపథ్యంలో బీజేపి నేతలు అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.
Kishan Reddy on PM Modi Warangal Tour: ప్రధాని మోదీ ఈ నెల 8న వరంగల్‌కు రానున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్లేస్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎంపిక చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై బండి సంజయ్ అనుచరులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.
సీనియర్ నేత జితేందర్ రెడ్డి ట్వీట్‌పై హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాజకీయాలలో ఉన్న వారు ఏది పడితే అది మాట్లాడకూడదని హితవు పలికారు. ఎందుకు ట్వీట్ చేశారో ఆయననే అడగాలని అన్నారు.
Bandi Sanjay On Dharmapuri Issue: ధర్మపురిలో పట్టపగలే గోవధ జరిగిందని ఫైర్ అయ్యారు బండి సంజయ్. ఈ ఘటనపై పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నిందితులను వదిలేసి.. అమాయకులపై కేసులు పెట్టారని అన్నారు.
PM Modi Telangana tour: ప్రధాని మోదీ వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించనున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. జూలై 12న రాష్ట్రానికి మోదీ రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.
Patriotic Democratic Alliance: కేంద్రం బీజేపీని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు దేశంలోని విపక్ష పార్టీలు వ్యూహం రచిస్తున్నాయి. పేట్రియాటిక్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో కూటమిగా ఏర్పడనున్నాయి. వచ్చే నెలలో ప్రతిపక్షాల అజెండా వెల్లడికానుంది.
దశాబ్ది ఉత్సాలపేరుతో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు తారాస్థాయికి చేరాయి. వైరా నిరసనల నేపథ్యంలో భారీ ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు.
Kishan Reddy Comments in BJP Maha Jan Sampark Abhiyan: గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు కట్టకట్టుకుని బీఆర్ఎస్లో చేరారని.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు కిషన్ రెడ్డి. అంబర్పేట్ నియోజకవర్గంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు.
Revanth Reddy Slams BRS: ఆనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేగు బంధం లేదు.. ఈనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేరు బంధం లేదు అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ నిధులు వాడుకునే తాను ఇల్లు కట్టుకున్నానని చెప్పారు. గతంలో ఉన్న ఎంపీల మాదిరి తాను గోల్మాల్ చేయలేదన్నారు.
Revanth Reddy Satires on Bellampalli MLA Durgam Chinnaiah: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, " ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే గురించి ప్రస్తావించేందుకు తనకే సిగ్గనిపిస్తోంది " అని అన్నారు. " దుర్గం చిన్నయ్య గురించి మాట్లాడటానికి సిగ్గనిపిస్తోంటే.. మరి ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికి వాళ్ల నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఏమనిపించడంలేదా ? " అని ప్రశ్నించారు.
Hijab Controversy: మహిళల వస్త్రధారణ పై ఈరోజు తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. హోంమంత్రి వెంటనే తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి అని రాణి రుద్రమ రెడ్డి డిమాండ్ చేశారు.
Revanth Reddy About Pro. Haragopal: ప్రొ. హరగోపాల్‌తో పాటు మరో 152 మందిపైన తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పాలకులు ప్రజాస్వామ్య వాదులను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడిన రేవంత్ రెడ్డి... ప్రో. హరగోపాల్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప మేధావి అని కొనియాడారు.
Revanth Reddy About KCR and Dharani Portal Scam: ఈ 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు ఇలాంటి దోపిడీకి పాల్పడలేదు అని చెబుతూ.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును అసెంబ్లీ ప్రాంగణంలో చెట్టుకు ఉరేసి చంపినా తప్పు లేదు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గల్ఫ్ దేశాల్లోలా కేటీఆర్‌ను రాళ్లతో కొట్టి చంపినా తప్పు లేదు అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Bandi Sanjay Warning to KCR: బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేయబోమని, ఇతర పార్టీల నుండి వచ్చే వాళ్లు పదవులకు రాజీనామా చేసిన తరువాతే బీజేపీలోకి తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ధరణి మంచి పోర్టల్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘‘ధరణి వల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే. ఆ కుటుంబం లాక్కున్న భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికే ధరణి తెచ్చారు. ఆ పోర్టల్ బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు’’అంటూ ఎద్దేవా చేశారు.
Rajnath Singh: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకాను సీజనల్ హిందూవుగా అభివర్ణిస్తూ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Telangana bjp chief bandi sanjay: తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెక్ బౌన్సర్ సీఎం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రైతులు బతికే పరిస్థితి లేదని కేసిఆర్ పుణ్యమా అని రైతులు బ్యాంకులలో డిఫాల్టర్లుగా నమోదయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.