కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ బిల్లులకు సంబంధించి మంగళవారం పలు రైతు సంఘాల ప్రతినిధులతో (Farmers Organizations).. కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని (Farm Bills) గత ఆరు రోజుల నుంచి పలు రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళనలపై మక్కల్ నీధి మయిం (Makkal Needhi Maiam ) అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) స్పందించారు.
Corona second wave: ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమని..తక్షణం చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తోంది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్నించే ఎక్కువ కేసులు వస్తున్నాయని స్పష్టం చేసింది.
ఏపీలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం మరో వినూత్న పథకం ప్రారంభమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.
వైద్యరంగంలో ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతోంది. భారతీయ ఆయుర్వేద వైద్య చికిత్సకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై ఆయుర్వేద వైద్యులు సైతం శస్త్ర చికిత్సలు చేసుకోవచ్చు.
Lastest Stimulus Package for Many Sectors | కరోనావైరస్ వల్ల భారతదేశంలో అనేక రంగాలు కుదేలయ్యాయి. ఇలాంటి రంగాలను ఆదుకోవడానికి కేంద్ర ఆర్థిక శాఖ మరో ఉద్దీపన ప్యాజీనీ ( Stimulus Package ) ప్రకటించింది. అందులో కీలక అంశాలు, రంగాలు ఇవే..
షిప్పింగ్ శాఖ పేరును మార్చనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. ఈ మంత్రిత్వశాఖ (Ministry of Shipping) పేరును ‘మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్’గా మార్పు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు.
ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం పట్టు బిగించింది. ఓ వైపు కౌంటర్ యాక్టివిటీస్ ద్వారా తీవ్రవాదుల్ని మట్టుబెడుతూనే..నిఘాను మరింతగా పెంచింది. కొత్తగా 18 మందిని తీవ్రవాదులుగా ప్రకటించింది.
భారత్ చైనా మధ్య గల్వాన్ వ్యాలీలో ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో ప్రభుత్వం కొత్తగా 47 బార్డర్ ఔట్ సోస్టులను ( BoPs) ఏర్పాటు చేయడానికి ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసు ( ITBP)కి అనుమతి ఇచ్చింది.
కరోనా లౌక్‌డౌన్ నాటినుంచి ఉపాధి లేక ప్రజలు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. చాలా మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి.. నెల నెల చెల్లించే ఈఎంఐలు సైతం చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం పండుగ కానుకగా శుభవార్త అందించింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం లోన్ మారటోరియంను మీరు వినియోగించుకున్నారా..లేనిపక్షంలో ఓ బంపర్ ఆఫర్ ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ బంపర్ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది..ఎవరికి కాదు..
మూడు రోజుల నుంచి వ్యవసాయ బిల్లులపై పార్లమెంట్ (Parliament) అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ సభలో విపక్షపార్టీల సభ్యులు ఆందోళన నిర్వహించి డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై అనుచితంగా ప్రవర్తించారు.
ఎన్డీఏ (NDA) ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లుల (agriculture bill) ను అందరూ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లులు తీసుకురావడాన్ని నిరసిస్తూ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ శిరోమణి అకాలీదళ్ పార్టీ సభ్యురాలు హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సైతం చేశారు. పలు వ్యవసాయ సంఘాలు రైల్ రోకోకు, బంద్‌కు పిలుపునిచ్చాయి. రేపు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.
దేశంలో ఓ వ్యసనంగా మారిన పబ్ జీ గేమ్ పై నిషేధం విధించింది భారత ప్రభుత్వం. ఈ నేపధ్యంలో ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా స్వదేశీ మల్టీ ప్లేయర్ గేమ్ త్వరలో ఆవిష్కృతం కానుంది.
రోనా వైరస్ మహహ్మారి ( Coronavirus ) విజృంభిస్తున్ననేపథ్యంలో జేఈఈ 2020 ( Joint Entrance Examination 2020 ), నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 ( NEET 2020 ) పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, పలు పార్టీలు, విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేశవ్యాప్త వ్యతిరేకత మధ్యనే తాజాగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.