Heavy Rains in AP | రానున్న నాలుగైదు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇంకా తేరుకోని తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడన ముప్పు పొంచి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సంభవించిన వరదలతో హైదరాబాద్ (Hyderabad Flood) నగరం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ (IMD)వాతావరణ కేంద్రం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం (Hyderabad Rains) అతలాకుతలమైంది. దాదాపు వారం నుంచి నగర ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారు. టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ (Actor Brahmaji ) ఇంటిని సైతం వరదలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఆయన సోమవారం ట్విట్టర్లో సరదాగా చేసిన కామెంట్స్.. కాస్తా.. ఏకంగా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తప్పుకునేలా చేశాయి.
తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్‌లో గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy rains) జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికీ చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదలతో హైదరాబాద్ (Hyderabad) నగరం సైతం అతలాకుతలమై భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను జలప్రళయం మరోసారి ముంచెత్తింది. రెండు రోజుల క్రితం భారీ వర్షాలతో అతలాకుతలమయిన నగరాన్ని భారీ వర్షంతో వరదలు చుట్టుముట్టాయి. ఎటుచూసినా నీరే కనిపిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడ్రోజులపాటు వర్షాలు తప్పేట్టు లేవు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు అరేబియా సముద్రం వరకు ఉత్తరాంధ్ర, తెలంగాణ దక్షిణ ప్రాంతానికి మధ్య తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.
భారీ వర్షాలతో దేశంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే అతలాకుతలం అవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, పూనే, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ (IMD) దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎటుచూసినా నీరే కనిపిస్తుండంటంతో భాగ్యనగరవాసులు భయాందోళన చెందుతున్నారు. ఇదిలాఉంటే.. భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య తాజాగా 15 కు చేరింది.
deep depression in bay of bengal | వాయుగుండం తీరం దాటడంతో దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచించారు.
తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో రాబోయే రెండు రోజులు.. సోమవారం, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ మేరకు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాల (Heavy rains) ముప్పు పొంచి ఉంది. తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంతో రోబోయే నాలుగురోజుల్లో ఇరురాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడ్రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తూనే ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ (Hyderabad)లో కుండపోత వర్షం కురిసింది. దీంతో నగర రోడ్లన్నీ జలశయాలను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ (GHMC) లోని పలుచోట్ల ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఎటుచూసినా.. వరదనీరే కనిపిస్తుండటంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు.
గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు మరో భారీ వర్షం (Heavy Rains In Telangana) ముప్పు పొంచి ఉంది. ఇదివరకే హైదరాబాద్ రోడ్లు జలశయాలను తలపిస్తున్నాయి. ఇక మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
ఏపీలో మరో మూడ్రోజులపాటు వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఇంకా కొనసాగుతున్న నేపధ్యంలో తేలికిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో మరో వారం రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ కారణంగా రానున్న నాలుగైదు రోజుల్లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.