Sunrisers Hyderabad's: ఐపీఎల్-2022 నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రియన్ లారాను బ్యాటింగ్ కోచ్‌గా, డేల్ స్టెయిన్ ను బౌలింగ్ కోచ్‌గా నియమించింది.
ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం తెలుస్తోంది. వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో జరగనుందని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. IPL 2022 వేలం 2018 మెగా వేలం మాదిరిగానే రెండు రోజుల పాటు జరగనుంది.
ఐపీఎల్ 2022 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా స్టెయిన్ బాధ్యతలు చెపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ స్టెయిన్‌తో మాట్లాడిందని, వచ్చే వారంలో అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉందిని సమాచారం తెలుస్తోంది.
2011 నుంచి సీఎస్కే తరఫున ఆడిన డ్వేన్ బ్రావో.. ఆ జట్టు సారథి ఎంఎస్ ధోనీతో అతడికి మంచి అనుబంధం ఉంది. ఇద్దరు సోదరుల్లా ఉంటారు. ఇద్దరి మధ్య బలమైన స్నేహం కూడా ఉంది. బ్రావోకు మహీ అండగా నిలుస్తూ కెరీర్‌కు ఎంతో దోహదం చేశాడు. ఇదే విషయాన్ని బ్రావో తాజాగా తన ఫ్యాషన్ లేబుల్ Djb47లో గుర్తుచేసుకున్నాడు.
Mohammed Siraj: ఐపీఎల్ 2022 సీజన్ మెగా ఆక్షన్‌కు ముందే బేరసారాలు జరిగిపోతున్నాయి. కొత్తగా వస్తున్న లక్నో ఫ్రాంచైజీ వివాదాలకు తెరతీస్తుంటే..భారీ ఆఫర్ ఇచ్చినా తిరస్కరిస్తూ ప్రశంసలు కురిపించుకుంటున్నాడు ఆ బౌలర్.
ముంబై ఇండియన్స్ జట్టుని విడిచిపెట్టడం హార్దిక్ పాండ్యా స్వంత నిర్ణయం కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు న్యూజీలాండ్ మాజీ కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కోచ్ డానియల్ వెటోరి. అదృష్టం కలిసొస్తే కేఎల్ రాహుల్ మరియు హార్దిక్ పాండ్యా ఒక జట్టుకే కలిసి ఆడే అవకాశం ఉందన్నాడు.
IPL 2022 Retention Players: ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్లేయర్ల జాబితాలు విడుదలయ్యాయి. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు చెందిన ఆ ఇద్దరు ఆటగాళ్లపై ఏడాదిపాటు వేటు పడే అవకాశాలున్నాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే.
Mumbai Indians Retained Players list: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 మెగా ఆక్షన్ కోసం ఆటగాళ్ల రిటైన్డ్ జాబితా విడుదలైంది. కొన్ని జట్లు ఊహించని విధంగా కొంతమంది ఆటగాళ్లను వదులుకున్నాయి. ముంబై ఇండియన్ జట్టు ఎవరిని వదులుకుంది, ఎవరిని రిటైన్ చేసుకుందో పరిశీలిద్దాం.
CSK Retained Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022కు సర్వం సిద్ధమవుతోంది. 2022 జనవరిలో మెగా ఆక్షన్‌కు సిద్ధమవుతుండటంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిటైన్డ్ ప్లేయర్స్ జాబితా విడుదల చేసింది. ముందుగా చెన్నై సూపర్‌కింగ్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లను పరిశీలిద్దాం.
ఫ్రాంచైజీల నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు వేచి ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే నలుగురు ఆటగాళ్లను గౌతమ్ గంభీర్ ఎంపిక చేశాడు. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, ఫాఫ్ డుప్లెసిస్ మరియు సామ్ కరన్‌లను గౌతీ ఎంచుకున్నాడు. తాను ఎంచుకున్న జాబితాలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీకి గౌతీ చోటివ్వలేదు.
ఐపీఎల్ 2022 రిటెన్షన్‌కు ముందు ఇద్దరు ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (పంజాబ్ కింగ్స్) మరియు రషీద్ ఖాన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) ఒక సంవత్సరం పాటు నిషేధాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కొత్త ప్రాంచైజీ లఖ్‌నవూ ఈ ఇద్దరు ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ముందుగానే కలిసిందట.
ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఏ జట్టు ఎవరిని వదులుకుంటుందో లేదా కొనసాగిస్తుందో అనేది త్వరలో తేలనుంది. ఏ జట్టు పరిస్థితి ఎలా ఉండనుందో పరిశీలిద్దాం.
Virat Kohli, Anushka Sharma's romantic pics: విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ జంట మీడియా ప్రపంచంలో ఓ హిట్ పెయిర్. సోషల్ మీడియాలో ఈ ఇద్దరి ఫోటోలు, వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. విరాట్ కోహ్లీ కానీ లేదా అనుష్కా శర్మ ఏదైనా ఫోటో లేదా వీడియో షేర్ చేసుకున్నారంటే.. అది క్షణాల్లో వైరల్ అవడమే కాదు.. క్షణాల వ్యవధిలో మిలియన్స్ కొద్ది లైక్స్, వ్యూస్, షేర్స్ వచ్చిపడుతుంటాయి.
RCB to retain Virat Kohli and Glenn Maxwell: ఐపిఎల్ 2022 టోర్నమెంట్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ మాజీ కెప్టేన్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది. అందుకే ఐపిఎల్ 2022 వేలం కంటే ముందుగానే ఈ ఇద్దరు ఆటగాళ్లను రీటేన్ చేసుకోవాలని చూస్తోందట.
IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్లో శిఖర్ ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడే అవకాశాలు కనిపించడం లేదు. మెగా వేలానికి ముందు శిఖర్ ధావన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోకపోవచ్చని సమాచారం.
IPL 2022 auction and CSK retainers list: ఎంఎస్ ధోనీతో (MS Dhoni) పాటు వచ్చే ఏడాది ఐపిఎల్ కోసం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) పేర్లు కూడా ఖరారయ్యాయి. ఐపిఎల్ 2021 టైటిల్ విన్నింగ్ రేసులో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు.
ఐపీఎల్ 2022 ఎడిషన్ ఏప్రిల్ 2 నుంచి ఆరంభం అవుతుందని సమాచారం. ఈ మేరకు అన్ని ఫ్రాంఛైజీలకు బీసీసీఐ సమాచారం అందించినట్లు ప్రచారం జరుగుతుంది. చెన్నై వేదికగానే తొలి మ్యాచ్ నిర్వహించనున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. మ్యాచుల తేదీలు ఖరారు కాకున్నా.. ఏప్రిల్ 2 నుంచి లీగ్ ఆరంబించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుందట.
Warner On Williamson: వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ లో తన స్నేహితుడైన కేన్ విలియమ్సన్.. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా కొనసాగుతాడని డేవిడ్ వార్నర్ చెప్పాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చిన వార్నర్.. విలియమ్సన్ కు సన్ రైజర్స్ ఫ్యాన్స్ మద్దతుగా నిలివాలని సూచించాడు.
Who is RCB captain in IPL 2022: ఐపిఎల్ 2022 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కేప్టేన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తున్నప్పటికీ.. ఒకవేళ వచ్చే ఏడాది కూడా ఆ జట్టు యుజ్వేంద్ర చాహల్‌ని తీసుకున్నట్టయితే.. విరాట్ కోహ్లీ స్థానంలో జట్టును ముందుండి నడిపించే సత్తా కూడా అతనికి (Yuzvendra Chahal to lead RCB ?) ఉందని రణ్‌ధీర్ సింగ్ గుర్తుచేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.