భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్ లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు
'కరోనా వైరస్'.. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ దెబ్బకు దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. దీంతో జనం బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఐతే కొంత మంది ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా ఉండలేమంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు.
మార్చ్ 16 నుంచి కర్తార్ పూర్ కారిడార్‌ను సైతం మూసివేశాం. పొరుగు దేశాల నుంచి భూభాగం ద్వారా ఇతర దేశాల నుంచి ప్రయాణికులను చెకింగ్ చేయడానికి చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కేవలం 20 కేంద్రాలగుండా మాత్రమే వచ్చేలా అనుమతి ఇచ్చామని’ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామన్ని దత్తత తీసుకొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ. 2,602 కోట్లు కేటాయించామని, గత ఐదేళ్ళుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారమే కారణమని, తెలంగాణకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని, కేంద్రమంత్రి పియూష్ గోయల్, అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఫిబ్రవరి 7న తెలంగాణ సీఎం కేసీఆర్ చివరి దశ మెట్రో రైలు ప్రాజెక్టు జేబిఎస్-ఎంజిబిఎస్ కారిడార్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం విచారం వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో అన్నీ ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2023అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అటు కేంద్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ పార్టీ అడ్డుకోలేదని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పాలనపై, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంతో దోస్తీ చేసి ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన 3 రాజధానుల ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అమరావతి రైతులు 19 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నా .. ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. పైగా రాజధానుల ఏర్పాటుపై కమిటీలపై కమిటీలు వేస్తుండడంపై అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.