'కరోనా వైరస్' ఆడుతున్న మృత్యుకేళీ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 36 లక్షలు దాటింది. భారత దేశంలోనూ కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పటికీ పరిమిత ఆంక్షలు సడలించడంతో మళ్లీ కేసుల సంఖ్య ఉద్ధృతమవుతోంది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
'కరోనా వైరస్' అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. చైనాలో పుట్టి.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా మహమ్మారి కారణంగా అమెరికాకు ఇప్పటికే భారీగా ఆర్ధిక, ప్రాణ నష్టం వాటిల్లింది.
లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన నేరం కింద టీడీపీ నేతలు ఇలా కేసులో ఇరుక్కోవడం ఇటీవల ఇది రెండోసారి. ఇదివరకే లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించారని టీడీపీ ఎంపీ కేశినేని నానిపై క్రిష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అలనాటి హీరోయిన్లతో మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులేశారు. మీరు చదివింది నిజమే.! 80 దశకాల్లో తారలతో చిరు ఆడిపాడారు. ఈ కార్యక్రమం గతేడాది నాటిది. ఆయన కొత్త ఇంట్లోకి మారిన సందర్భంగా 80 దశకాల్లో హీరోయిన్లను ఆహ్వానించారు. అప్పటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ లాక్ డౌన్ ఆంక్షలకు సడలింపు ఇచ్చారు. నేటి నుంచి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపులు కొనసాగుతున్నాయి. వైన్ షాపులు, సెలూన్లు పునఃప్రారంభించారు. దీంతో జనం వాటి వద్ద భారీ క్యూలు కట్టారు.
'కరోనా వైరస్' విస్తరిస్తున్నా... జనం మందు కోసం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా పరిమిత ఆంక్షలతో నేడు మద్యం షాపులు తిరిగి తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. తెలంగాణ, ఝార్ఖండ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు ఇవాళ తెరుచుకోలేదు.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.. మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీల నుంచి రైల్వే శాఖ టికెట్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
'కరోనా వైరస్'.. ప్రపంచాన్ని కమ్మేస్తోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మహమ్మారి ఉద్ధృతి తగ్గడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ లాక్ డౌన్ పరిధిలోనే కాలం గడుపుతున్నాయి. ఎక్కడ చూసినా బంద్ వాతావరణమే కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటిలోనూ పరిశ్రమలు, ఇతర వాణిజ్య, వ్యాపారాలు అన్నీ మూతపడ్డాయి. ఫలితంగా కార్మికులు, ఇతర పేదవర్గాల వారు పడరానిపాట్లు పడుతున్నారు.
'కరోనా వైరస్' ఉద్ధృతమవుతున్న వేళ భారత దేశంలో లాక్ డౌన్ ను మే 17 వరకు పొడగించారు. ఈ క్రమంలో నేటి నుంచి మూడో దశ లాక్ డౌన్ ప్రారంభమైంది. మరోవైపు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కేంద్రం మరిన్ని ఆంక్షలను సడలించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల కేంద్రం ఇచ్చిన సడలింపులతో కార్యకలాపాలకు అనుమతిస్తున్నాయి. అదే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇంతకు ముందు ఉన్న విధంగానే లాక్ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా విధించిన రెండో విడత లాక్డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఆంక్షల సడలింపులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాలకు మినహాయింపులు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించాయి.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం ప్రదర్శిస్తోంది. కరోనా వైరస్ రోజురోజుకు వేగంగా విజృంభిస్తోంది. ఎన్నడూ లేనంతగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 2,487 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో
కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పునఃప్రారంభం జూన్ 1వ తేదీన ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదని ఓ అధికారి పేర్కొన్నారు. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో పరిస్థితులను
'కరోనా వైరస్'.. ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తోంది. కానీ మన దాయాది దేశం పాకిస్తాన్‌కు మాత్రం వరంలా మారింది. కరోనా వైరస్ పేరుతో మరింత అరాచకానికి తెరతీసింది పాకిస్తాన్ ప్రభుత్వం.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారిని ఎదుర్కునేందుకు కరోనా వారియర్స్ తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి మహమ్మారితో మొదటి వరుసలో నిలబడి యుద్ధం చేస్తున్నారు.
'కరోనా వైరస్' మహమ్మారి ప్రపంచాన్ని కుదుపేస్తోంది. దీని నుంచి కాపాడు దేవుడా..! అని ప్రపంచవ్యాప్తంగా జనం ఎదురు చూస్తున్నారు. కానీ భూమి మీద మనుషుల రూపంలో ఉన్న దేవుళ్లు వైద్యులు. అవును.. అందుకే ఇప్పుడు వారికే జనం మొక్కుతున్నారు. తమను కాపాడాలని వేడుకుంటున్నారు.
'కరోనా వైరస్' క్రమక్రమంగా విస్తరిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఢిల్లీ అంతటా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది.
'కరోనా వైరస్' కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. భారత దేశంలోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.
'కరోనా వైరస్' మృత్యు ఘంటికలు మోగిస్తున్న వేళ.. ఆ మహమ్మారిని నిత్యం ఎదుర్కొంటున్న వైద్యులు, వైద్య సిబ్బందికి భారత త్రివిధ దళాలు గౌరవ వందనం చేశాయి. ప్రభుత్వ ఆసుపత్రులపై పూల వర్షం కురిపించాయి.
'కరోనా వైరస్' శరవేగంగా విస్తరిస్తున్న వేళ.. లాక్ డౌన్ పొడగించారు. ఈ క్రమంలో దేశంలోని వలస కార్మికులు.. ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఐతే వారిని స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం శ్రామిక్ రైలు పేరుతో ప్రత్యేక రైలు బండి నడిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.