ఒకే బిల్డింగ్‌లో నివాసం ఉంటున్న వారిలో 41 మందికి కరోనావైరస్ సోకిన ఘటన ఢిల్లీలోని కపాషేరా ప్రాంతం టెకె వాలి గల్లీలో కలకలం సృష్టించింది. ఏప్రిల్ 18వ తేదీనే ఇదే బిల్డింగ్‌కి చెందిన ఓ వ్యక్తికి కరోనావైరస్ సోకినట్టు గుర్తించారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆందోళన నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు దారులకు, దిగువ మధ్య తరగతికి చెందిన ప్రజలకు ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతా కలిగిన మహిళలందరికీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించింది.
తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా రోజూవారీగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్‌కే పరిమితమవడం చూసి మురిసిపోయిన తెలంగాణ వాసులకు శనివారం కరోనా మరోసారి షాక్ ఇచ్చింది. నేడు రాష్ట్రంగా కొత్తగా 17 మందికి కరోనావైరస్ సోకినట్టు తేలింది.
కరోనావైరస్ మహమ్మారి బారిన పడకుండా జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. సమాజహితం ఏదైనా చేయాలంటే ముందుగా ప్రాణాలతో ఉండాలని సూచిస్తూ.. పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అంటే ముందుగా గుర్తుకొచ్చేది నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో గుంపులు గుంపులుగా తరలివచ్చి శ్రీవారిని దర్శించుకోవడమే. కానీ ఇకపై అలాంటివి కుదరదని టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి (SV SubbaReddy) తెలిపారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతుండటంతో వ్యాప్తి కట్టడి దిశగా కేంద్రప్రభుత్వం మరోసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా చాలా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.
'కరోనా వైరస్' కరాళ నృత్యం చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా రెండోసారి లాక్ డౌన్ పొడగించారు. మే 17వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాలను గజగజా వణికిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 62 కొత్త కేసులు నమోదయ్యాయి.
'కరోనా వైరస్' విస్తరిస్తున్న నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో సినీ ప్రముఖులు ఇళ్లల్లోనే ఉండి లాక్ డౌన్ కాలాన్ని సరదాగా కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు.
దేశంలో కరోనా భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. కరోనా తమకు సోకిందనే భయంతో కొందరు ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఇవాళ హైదరాబాద్ లోని రామంతాపూర్‌లో చోటు చేసుకుంది.
'కరోనా వైరస్'.. భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు క్రమక్రమంగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరగడం విశేషం.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో తన వంతు సహకారం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని తబ్లీగీ జమాత్ కు చెందిన ఓ సభ్యుడు తెలిపారు. ఇప్పటికి రెండుసార్లు ప్లాస్మా ఇచ్చానని వెల్లడించారు. మరో 10 సార్లయినా ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా 6 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు గుర్తించిన ఆరు కేసులలో 5 జీహెచ్ఎంసీ పరిధిలోవి కాగా మరొకటి రంగారెడ్డి జిల్లా పరిధిలోనిది. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం.. శుక్రవారం నమోదైన ఆరు కరోనా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,044కు చేరుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తించకుండా నివారించడం కోసం కేంద్రం మరోసారి లాక్‌డౌన్‌ని మే 17వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. మూడోసారి లాక్‌డౌన్‌ని పొడిగిస్తూ నేడు ఆదేశాలు జారీచేసిన కేంద్ర హోంశాఖ.. మే 17వ తేదీ వరకు అందుబాటులో ఉండే సేవల వివరాలు వెల్లడిస్తూ పలు మార్గదర్శకాలు సైతం జారీచేసింది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో మూతపడిన మద్యం విక్రయాలు తిరిగి ప్రారంభం కానున్నాయని మహారాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు ఇతరులను ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు అనుమతించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే సూచించిన విషయం తెలిసిందే. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ
మే 3తో ముగియనున్న లాక్ డౌన్ ను కేంద్రం మరో రెండు వారాలపాటు పొడిగించింది. తాజా ఆదేశాల ప్రకారం మే 17వ తేదీ వరకు భారత్ లో లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
కరోనా మహమ్మారిపై పోరాటాన్ని కొనసాగిస్తూ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా మే 3న లాక్డౌన్ ముగియనున్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సహా
బెంగళూరులో నిర్మాణరంగంలో కూలీ పనిచేసుకుంటున్న 28 ఏళ్ల హరిప్రసాద్.. లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో సొంతూరుకి బయల్దేరాడు. బెంగుళూరు నుంచి కాలినడకనే 150 కిమీ మేర ప్రయాణించాడు. సొంతూరికి దగ్గర్లోకి వచ్చాకా అలసిపోయి కుప్పకూలి మృతి చెందాడు.
కరోనా మహమ్మారిని కట్టడి చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీస్ కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించబోయిన సంఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.