'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఎవరూ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసులు నిత్యం పహారా కాస్తున్నారు.
'కరోనా వైరస్' అందరి సమస్య అని..అందుకే అందరూ ఐకమత్యంగా కలిసి పోరాడాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా కరోనా ఫ్రీ అయిందని.. ఎవరూ బాధ్యత మరిచిపోవద్దని కోరారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని కోరారు. అలాగే ముస్లింలు ఇళ్లల్లోనే ఉండి నమాజ్ చేసుకోవాలని కోరారు.
'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా మృత్యుకేళీ ఆడుతోంది. వైరస్ మహమ్మారి దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఎప్పుడు ఎవరికి వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితి ఉంది.
'కరోనా వైరస్'.. భయంకరంగా కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటు భారత దేశంలోనూ కరోనా వైరస్ మహమ్మారి.. రోజు రోజుకు భయంకర రూపం దాలుస్తోంది. ప్రతి రోజూ పెరుగుతున్న పాజిటివ్ కేసులతో భయాందోళన నెలకొంది.
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 32 వేలకు చేరువలో ఉంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చివరి 24 గంటల్లో కొత్తగా మరో 1,813 కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 31,787కి చేరింది.
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుండటం అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కొంత ఊరటను కలిగిస్తోంది. మరోవైపు కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుండటం విశేషం.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచమే లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయింది. ఏ దేశం చూసినా.. ఏ ప్రాంతం చూసినా .. అంతటా లాక్ డౌన్ మాత్రమే కనిపిస్తోంది. కరోనా పుణ్యమా.. అని అన్నీ మూతపడే ఉన్నాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం లేదు. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలి.
'కరోనా వైరస్' శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఎక్కువగా లక్షణాలు లేని కరోనా పాజిటివ్ కేసులు ఉంటున్నాయి. మరోవైపు తక్కువ లక్షణాలు కనిపించే కేసులు సైతం వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో రోగులను గుర్తించి ఆస్పత్రికి తరలించడం.. పైగా ఆస్పత్రులన్నీ కరోనా వైరస్ రోగులతో నిండి ఉన్న క్రమంలో కొత్త నిర్ణయం తీసుకుంది.
'కరోనా వైరస్' 11 రకాలు. నమ్మశక్యం కాకున్నప్పటికీ మీరు చదివింది నిజమే..!! కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ మొత్తంగా 10 రకాలుగా మారిపోయిందని భారత శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది.
'కరోనా వైరస్' ఎన్నెన్నో సిత్రాలు చేస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి వైరస్.. వింత వింత పనులకు కూడా కేంద్ర బిందువవుతోంది. భారత దేశంలో పెళ్లి సంస్కృతి చాలా గొప్పది. అలాంటిది కరోనా వైరస్ దెబ్బకు పెళ్లిళ్ల అర్థమే మారిపోతోంది.
చార్ ధామ్ యాత్రల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఇవాళ ( బుధవారం ) ఉదయం సరిగ్గా 6 గంటల 10 నిముషాలకు ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఇవాళ ఉదయం తిరిగి ఆలయం తలుపులు తీశారు.
కరోనా మహమ్మారి విజృంభణతో కొద్దిరోజులుగా భగ భగ మండిన బంగారం ధరలు మంగళవారం వరుసగా రెండో రోజూ పడిపోయాయి. స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టడం, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్డౌన్ల నుంచి సడలింపులు
ఉత్తర ప్రదేశ్ డియోరియా జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ముస్లిం అమ్మకందారుల నుండి కూరగాయలను కొనవద్దని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. అయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అయింది.
లాక్డౌన్ ఉన్నన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) చేయడం బాగుంది కానీ లాక్ డౌన్ తర్వాత పరిస్థితేంటి ? కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇంట్లోంచి బయటికి వెళ్తే.. కరోనా నుంచి తప్పించుకోవడం ఎలా ? ప్రస్తుతం చాలామంది ఐటి ఉద్యోగులను వేధిస్తున్న ప్రశ్న ఇదే.
'కరోనా వైరస్' కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలీసులు ఏం చేస్తారు.? అదేం ప్రశ్న అంటారా..? రోడ్లపై పహారా కాస్తారు. కరోనా వైరస్ లాక్ డౌన్ ఉంది కాబట్టి ఎవరూ నిబంధనలు ఉల్లంఘించకుండా చూస్తారు. బయటకు వచ్చిన వారిని ఇళ్లకు వెళ్లమని చెబుతారు. అని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు.
'కరోనా వైరస్'.. కాటేస్తే .. కాటికే..!! అందుకే జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం చెప్పినట్టు.. పోలీసులు చెప్పినట్టు వినండి. లేదని ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చారో.. యమధర్మరాజు పాశం విసురుతాడు జాగ్రత్త..! బుద్ధిగా ఇంట్లో ఉండండి.. మాస్కులు ధరించండి...!! సరిగ్గాఇలాగే ప్రచారం చేస్తున్నాడు యమధర్మరాజు.
'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఏ దేశం చూసినా.. కరోనా మహమ్మారి బారిన పడి గజగజా వణుకుతోంది. భారత దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసులు 30వేలకు చేరువలో ఉన్నాయి.
'కరోనా వైరస్'.. మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో భారత దేశ వ్యాప్తంగా అలజడి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే అత్యధిక మరణాలు సంభవించడం కలకలం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.