Sharmila Security Enhance: తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించింది. రెండు రోజుల కిందట భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన ఆమెకు తాజాగా భద్రత పెంచుతూ పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
AP Rajya Sabha Candidates: ఊహించినట్టుగానే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో మూడో స్థానానికి కూడా పోటీ దిగుతోంది. రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఆ పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించడం విశేషం.
Singareni Job Fair: తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటనలు ఊరిస్తున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించినా ఇంకా ఉద్యోగ ప్రకటనలు విడుదల కావడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పోలీస్, గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటనలు వేస్తామని ప్రకటించారు.
Harish Rao Jangaon Meeting: కృష్ణా జలాల వివాదంతో మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడేక్కగా.. గులాబీ పార్టీ నాయకులు వెనక్కి తగ్గడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్‌పై, రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
EC Review on AP Elections: దేశంలోనే ఆసక్తిగొలిపే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది.ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఎన్నికలపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల సంఘం వరుస సమీక్షలు చేస్తోంది.
IPL 2024 Schedule: ఐపీఎల్ 2024 వేలం ముగిసి ఇప్పటికే జట్లన్నీ సిద్ధమైపోయాయి. ఐపీఎల్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కీలకమైన అప్డేట్ వెలువడింది. ఈసారి ఐపీఎల్‌కు ఎన్నికలు అడ్డొచ్చే పరిస్థితి కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fight in Social Media: హామీలపై ప్రశ్నిస్తే 'చెప్పుతో కొట్టాలి' అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలను అమలు చేయలని కాంగ్రెసోళ్లను ఏ 'చెప్పు'తో కొట్టాలని ప్రశ్నించారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ సభలో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
INDIA Alliance Break: ప్రతిపక్ష ఇండియా కూటమికి ఒకే రోజు ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకటి కాదు రెండు అనూహ్య సంఘటనలు సంభవించాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మొదట తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా.. ఆ కొద్దిసేపటికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే ప్రకటించింది. ఇరు పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తామని ప్రకటించడంతో ఇండియా కూటమిలో కలకలం ఏర్పడింది.
CM Jagan Vs YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో చతికిలబడిన కాంగ్రెస్‌కు మళ్లీ జీవం పోసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు వైఎస్ షర్మిల. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచే దూకుడు పెంచుతున్నారు. నేరుగా జగన్‌ను టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్న షర్మిల కాంగ్రెస్‌కు మరింత ఊపు తెచ్చేందుకు రెండు స్థానాల్లో పోటీకి సిద్ధపడుతున్నారు.
Ap Voter List 2024: ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఏపీ ఎన్నికల్లో మహిళలే ఫలితాలను నిర్దేశించనున్నారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు భారీగా ఉండటం ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pooja Hegde Latest Pics: పూజా హెగ్డే టాలీవుడ్లో నిన్న మొన్నటి వరకు హాట్ హీరోయిన్. అగ్ర హీరోల ఫస్ట్ ఛాయిస్ ఆమె ఉండేడి. ఆమె యాక్ట్ చేస్తే సినిమా హిట్ అనేంతగా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఆ తర్వాత ఆమె యాక్ట్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ ఐరన్ లెగ్గా ముద్ర వేసుకుంది. తాజాగా ఈ భామ ఆకుపచ్చ కోకలో దర్శనమిచ్చి కిరాక్ పుట్టించింది.
AP Assembly Election 2024: సీఎం జగన్‌కు సిట్టింగ్ ఎంపీ బిగ్ షాక్ ఇచ్చారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నిలకు ముందు వరుస రాజీనామాలు అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి.
PM Narendra Modi as Vishwa Netha: భారత దేశ ప్రధాన మంత్రిగా రెండు సార్లు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నేతగా నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణంతో అసలు సిసలు యుగ పురుషుడిగా జాతి జనుల చేత కీర్తించబడుతున్నారు. తాజాగా ఈయన జీవిత చరిత్రపై విశ్వనేతగా ఓ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.
AP Elections 2024: ఏపీ ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కుతోంది. అభ్యర్దుల మార్పులతో వైసీపీ దూసుకుపోతుంటే..ప్రతిపక్షం టీడీపీ-జనసేన కూటమి పొత్తు సమీకరణాల్లో నిమగ్నమైంది. ఈలోగా ఏపీలో ఈసారి అధికారం ఎవరిదనే విషయంపై జరిగిన తాజా సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
Anganwadi Strike: ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మెతో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంది, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Didn't Expected Result: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో లోక్‌సభ సెగ్మెంట్లవారీగా చేపట్టిన సన్నాహాక సమావేశాలు ముగిశాయి. చివరి రోజు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంపై సమావేశం నిర్వహించగా.. ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Drop OnePlus Nord 3 Price: అత్యంత చౌకగా వన్ ప్లస్ మొబైల్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు.. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన వన్ ప్లస్ నార్డ్ 3 5G (OnePlus Nord 3 5G) మొబైల్ పై భారీ తగ్గింపు లభిస్తుంది.
ఆరోగ్యం అనేది ఎప్పుడూ తినే ఆహారంపై ఆదారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలుంటే డైట్‌పై మరింత శ్రద్ధ అవసరం. పిల్లకు హెల్తీ ఫుడ్ అందించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేయవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.