'మా' అధ్యక్షుడు నరేశ్‌పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరపకుండా, తిరిగి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగాలే పావులు కదుపుతున్నారని ఆమె ఆరోపించారు.
MAA Elections 2021: టాలీవుడ్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతుంటాయి. నలుగురు బరిలో ఉండటంతో ఈసారి పోటీ రసవత్తరంగా మారిన నేపధ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు.
టాలీవుడ్ హీరో రాజశేఖర్ రాజీనామాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఆమోదించింది. క్రమశిక్షణ చర్యల కోసం ఉన్నత స్థాయి కమిటీని సైతం ఎగ్జిక్యూటివ్ సభ్యులు నియమించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, మురళీమోహన్, మోహన్‌బాబు, చిరంజీవి, జయసుధలతో ఓ కమిటీ వేశారు.
వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఒకవైపు పవన్ అభిమానినని ప్రకటించుకుంటూనే మరోవైపు ఆయనకు చురకలు అంటిస్తోంది. ఫిల్మ్ ఛాంబర్ వద్ద పవన్ అభిమానుల ఆందోళన గురించి స్పందిస్తూ ఫ్యాన్స్ పవన్ కల్యాణ్ గారికి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు అని ఉచిత సలహా ఇచ్చింది.
జనసేన కార్యకర్తలు తనపై చేస్తున్న కామెంట్స్ గురించి స్పందిస్తూ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి.. ప్రజల సమస్యల కోసం పోరాడుతూ.. నలుగురికి మార్గదర్శకం అవ్వాలి అంతేకానీ సహనం లేకుండా కార్లు పగలగొట్టడం సరికాదని జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడింది.
శ్రీరెడ్డి,వర్మ వ్యవహారం తేల్చాలని మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా)కు పవన్ కల్యాణ్ అల్టిమేటం జారీ చేశారు. 24 గంటల గడువు ఇచ్చి..ఈ లోపు తేల్చకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని హెచ్చరించారు. వర్మ ప్రోద్భలంతో నటి శ్రీరెడ్డి పవన్ కల్యాణ్ తో పాటు ఆయన తల్లిపై అసభ్య పదాజాలంతో దూషించిన విషయం తెలిసిందే. దీన్ని సీరియస్ గా తీసుకున్న పవన్ కల్యాణ్ .. ఈ రోజు ఫిలిం చాంబర్ వద్ద బైఠాయించారు. పవన్ కు మద్దతుగా మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.
పవన్ స్టార్ పవన్ కల్యాణ్ పై నటి శ్రీరెడ్డి ఇటీవలే సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ అంశం చర్చనీయంశంగా మారడం.. ఆమె పవన్ వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు సంధించడం వెనుక పెద్దల హస్తముందని వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి చేత ఇలా మాట్లాడించిన పెద్దమనిషి ఎవరే విషయం ప్రపంచానికి తెలిసి వచ్చింది. అదేనండి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్మకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. శ్రీరెడ్డి చేత పవన్ ను తిట్టించడానికి గల కారణాలను వివరిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఇంతకీ వర్మ అలా ఎందుకు చేశాడో ఆయన మాటల్లోనే వినండి....
పవన్ కల్యాణ్ తల్లికి నటి శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పింది. ఎమోషన్ లో ఆమెను ఏకవచనంతో సంబోధించాను. ఆమె విషయంలో నేను చేసింది ముమ్మాటికి తప్పే..అందుకే క్షమించమని కోరుతున్నాను. పవన్ చెప్పినట్లుగా ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తా..పోలీస్ స్టేషన్ కు వెళ్లి న్యాయం కోరుతా..ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గను..ఈ విషయంలో ఎవరినైనా ఎదిరిస్తా..జీవితంలో మంచి, చెడులను చూశా..సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటానని వెల్లడించింది. తన డిమాండ్ల నెరవేరే వరకు పోరాటం విరమించను. మహిళ ఆర్టిస్టులకు గౌరవం దగ్గలన్నదే తన లక్ష్యమని శ్రీరెడ్డి వ్యాఖ్యనించారు.
మోగా ఫ్యామిలీ మెంబర్ నాగబాబులో అసలు మానవత్వంమే లేదు.. ఆయన ఎంతో క్రూరులు.. ఆయనకు ఆడవాళ్లంటే ఏమాత్రం గౌరవం లేదు.. ఆయనకు జాలి,దయ అనేవి లేవు అంటూ ..ఆయనపై శ్రీరెడ్డి తన దైన శైలిలో విరుచుకుపడింది. శ్రీరెడ్డి డిమాండ్లపై నాగబాబు స్పందించిన కొద్దిసేపటికే ఆయనపై శ్రీరెడ్డి ఎదురుదాడికి దిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీతులు మాట్లాడుతున్న నాగబాబు మిస్టర్ పర్ఫెక్ట్ కాదని బాంబు పేల్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.