త్రుదేశాల నుంచి భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఎదురైన ధీటుగా జవాబిచ్చేందుకు భారత్ (India) అన్ని విధాలుగా సమయత్తమవుతోంది. ఇందులో భాగంగా భారత రక్షణ రంగాన్ని వీదేశీ, స్వదేశీ పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేస్తూ తిరుగులేని శక్తిగా రూపాంతరం చెందుతోంది. తాజాగా భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో సరికొత్త అస్త్రాన్ని పరిక్షించింది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు. ఇటీవల ఈ మహమ్మారి బారిన పడి చనిపోతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతూనే ఉంది
ఒక చిన్న పాము ( Snake ) ఇంట్లోకి వస్తేనే అంతా హడలెత్తిపోతారు. అలాంటిది 5 అడుగుల తాచు పాము ( Cobra ) బెడ్ రూమ్‌లోకి ప్రవేశించి ఏకంగా బెడ్ ఎక్కి పడుకుంటే ఇక ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.
తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( Heavy rain ) నదులు, వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాల్లోకి వరద నీరు ఉప్పొంగుతుండటంతో అనేక జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి.
APSRTC buses | అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ బస్సులను మీ రాష్ట్రాల్లోకి అనుమతించాల్సిందిగా కోరుతూ పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ఏపీ సర్కార్ ( AP govt) తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఓ లేఖ రాశారు.
మూఢనమ్మకాలు ఓ వ్యక్తి ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. కరోనాను అంతం చేస్తానంటూ నమ్మించిన అర్చకుడు ఏకంగా ఓ వ్యక్తిని బలి ఇవ్వడం కలకలం రేపుతోంది. పోలీసులు రంగంలోకి దిగారు.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న కారణంగా దేశంలోని చాలా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా విభజించారు. చాలా ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లలోనే ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
'కరోనా వైరస్' కారణంగా దేశంలో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కూలీల కోసం కేంద్రం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లు నడిపిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 200 రైళ్లు నడిపినట్లు తెలుస్తోంది. దీంతో వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు.
అంఫాన్ తుఫాన్ ( Cyclone Amphan ) కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూసిన పశ్చిమ బంగాల్ (West Bengal ), ఒడిషా ( Odisha ) రాష్ట్రాల్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) పర్యటించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. మొదట పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతా ఎయిర్ పోర్టులో దిగిన ప్రధాని మోదీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి ( Mamata Banerjee ), రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ( Jagdeep Dhankhar ) ఎదురెళ్లి స్వాగతం పలికారు.
దేశ వ్యాప్తంగా ఒకవైపు కరోనా మహమ్మారి కుదిపేస్తుంటే మరోవైపు తుఫాన్ బీభత్సం ప్రదర్శిస్తోంది. కాగా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధాని మోదీ శుక్రవారం పర్యటించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.
కోల్‌కతా : అంఫాన్ తుఫాన్ ( Cyclone Amphan ) భారీ ప్రాణ, ఆస్టి నష్టాన్ని మిగిల్చింది. కేవలం పశ్చిమ బెంగాల్లోనే ( West Bengal ) అంఫాన్ తుఫాన్ తాకిడికి 72 మంది మృతి చెందినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( CM Mamata Banerjee ) తెలిపారు. చనిపోయిన 72 మందిలో 15 మంది కోల్‌కతాకు చెందిన వారేనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.
ఎంఫాన్ తుఫాన్.. పశ్చిమ బెంగాల్ లో బీభత్సం సృష్టించింది. ఆరు గంటలపాటు ఈదురుగాలులు, భారీ వర్షంతో అంతా అతలాకుతలమైంది. ఎంఫాన్ దెబ్బకు పశ్చిమ బెంగాల్ లో 12 మంది మృతి చెందారు.
అంఫన్ తుఫాన్ తీరాన్ని తాకే ప్రక్రియ ( Landfall of Cyclone Amphan ) మొదలైంది. నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ప్రక్రియ మొదలవగా.. దాదాపు 4 గంటలపాటు సైక్లోన్ ల్యాండ్ ఫాల్ కొనసాగుతుందని ఒడిషాలోని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పికే జనా తెలిపారు. ఇప్పటికే పారాదీప్, కెండ్రపారా, ధమ్ర దాటేసిన అంఫాన్ తుఫాన్.. ప్రస్తుతం బాలాసోర్‌ను ( Balasore in Odisha ) ఆనుకుని ఉన్న తీరం వద్ద కొనసాగుతుందని అన్నారు.
మహారాష్ట్ర నుంచి సొంత గ్రామానికి ఓ వలస కార్మికుడు 3000 కి.మీ మేర సైకిల్ ప్రయాణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన కార్మికులు తన అనుభవాలను ఏఎన్ఐ మీడియాతో షేర్ చేసుకున్నాడు.
కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేసి, ఆమె శవాన్ని 300 ముక్కలు చేసిన నేరానికిగాను ఇండియన్ ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ కల్నల్ సోమ్‌నాథ్ పరిడాకు భువనేశ్వర్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. క్లూస్ టీమ్ అందించిన శాస్త్రీయ ఆధారాలు, 24 మంది సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం ఖోర్జా జిల్లా కోర్టు ఈ తీర్పు వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.