Petrol prices, diesel prices today: పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజురోజుకు పైపైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుసరిస్తూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు (Oil companies) ధరలు పెంచుతూపోతున్నాయి.
Petrol, diesel and LPG prices latest updates| న్యూఢిల్లీ: వాహనదారులకు, సామాన్యులకు గుడ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఇటీవల కాలంలో భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తగ్గుముఖం పట్టాయని, రానున్న రోజుల్లో మరింత తగ్గనున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది.
LPG cylinder new prices: ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఎల్పిజి సిలిండర్ ధరను రూ .10 మేర తగ్గించాయి. ఎల్పీజీ సిలిండర్ ధరల్లో 125 రూపాయల పెంపు అనంతరం ఇలా రూ.10 మేర తగ్గడం వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం కానుంది. అయితే ఎల్పీజీ ధరలు ఎలాగైతే పెరుగుతూ వచ్చాయో అలాగే ఈ తగ్గుదల కూడా కొనసాగితేనే వారికి ఇంకొంత ఉపశమనం లభించనుంది.
Electric scooters: ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర వంద దాటేసింది. పెట్రో ధరలు అంతకంతకూ పెరుగుతుండంతో ప్రజలు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. ఫలితంగా ఈ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లవైపు మొగ్గు చూపుతున్నారు.
Petrol and diesel price today: చమురు ధరల పెరుగుదలను కొనసాగిస్తూ Oil companies శనివారం వరుసగా 12వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 39 పైసలు పెరగగా, లీటర్ డీజిల్ ధర 37 పైసలు పెరిగింది. ఈ పెంపు అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.58 చేరగా, లీటర్ డీజిల్ ధర రూ. 80.97 కి చేరింది.
Petrol-Diesel Prices: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ధరలు పెరగడమే తప్ప.తగ్గే సూచనలు కన్పించడం లేదు. అన్నివైపులా విమర్శలు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక ప్రకటన చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ హైకు చేరుకున్నాయి. భారీగా పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు ఆందోళన కల్గిస్తున్నాయి.
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు పెరిగితేనే వాహనదారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందంటే... ఇప్పుడు పెట్రోల్ ధర ( Petrol price ) కంటే డీజిల్ ధర ఎక్కువ ( Diesel price ) అవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు ( Petrol prices ) జూన్ 7వ తేదీ నుంచి ఏ రోజుకు ఆరోజు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ( Fuel prices) వాహనదారులు గగ్గోలు పెడుతుండగా.. వరుసగా 16వ రోజైన ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ మూడు నెలల నుండి కొనసాగుతోంది. అయితే అప్పటి నుండి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. ఇప్పుడు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు
కరోనావైరస్ నివారణ కోసం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పడిపోయిన ఆదాయాన్ని తిరిగి పుంజుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నాయి. అందులో భాగంగానే ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో పాటు మద్యంపై ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
రాయితీ లేని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరపై రూ.162.50 తగ్గిస్తున్నట్టు శుక్రవారం కేంద్రం ప్రకటించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో రాయితీ లేని ఎల్పీజీ సిలిండర్ల ధరలు సైతం దిగొస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) చైర్మన్ సంజీవ్ సింగ్ వాహనదారులకు షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ''లో ఎమిషన్ BS-VI'' పరిజ్ఞానం కలిగిన ఇంధనాన్ని అందుబాటులో తీసుకొస్తున్నామని సంజీవ్ సింగ్ పీటీఐకి తెలిపారు.
ధరల తగ్గుదల అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ 74.43గా ఉండగా డీజిల్ రూ.67.61 గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనూ లీటర్ పెట్రోల్ ధర రూ.80.03 గా ఉండగా లీటర్ డీజిల్ ధర 70.88 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.79.14 కాగా లీటర్ డీజిల్ ధరలు 73.72గా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ సహా హైదరాబాద్, అమరావతి, విజయవాడల్లో శుక్రవారం నవంబర్ 15న డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ పెట్రోల్ ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.
పెట్రోల్, డీజిల్ ఇంధనాలను ఇకపై సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ వంటి అన్ని ఇతర వాణిజ్య కేంద్రాల్లో అమ్మకాలు జరిపేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ త్వరలోనే పెట్రోలియం, సహజ వాయువు వనరుల శాఖ ఓ ప్రతిపాదనను కేబినెట్ ముందుకు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన ఇంధనం ధరల్లో మళ్లీ క్రమక్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో భారత్లోని వివిధ నగరాల్లో శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.