ICC T20 World Cup: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఒమన్‌తో పాటు యూఏఈలో ఈ మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
Afghanistan cricket team future amid Afghanistan crisis: ఇప్పుడిప్పుడే ఆప్ఘనిస్థాన్‌లో క్రికెట్‌తో పాటు అన్ని ఇతర క్రీడలకు కూడా ప్రాధాన్యం పెరిగి అంతర్జాతీయ వేదికలపైనా అంతో ఇంతో సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాలిబన్లు ఆప్ఘనిస్థాన్‌ని ఆక్రమించుకుని తమ చెప్పుచేతల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఇక ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ భవితవ్యం ఎలా ఉండనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన భారత్ స్టార్ జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా ప్రపంచ ర్యాంకింగ్స్ లో 14 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి దూసుకెళ్లాడు.
Twitter removes blue tick on MS Dhoni twitter account: మహేంద్ర సింగ్ ధోనీకి ట్విటర్ షాక్ ఇచ్చింది. టీమిండియా మాజీ కెప్టేన్ ధోని అకౌంట్ నుంచి ట్విటర్ బ్లూ టిక్‌ను తొలగించింది. ధోనీ ట్విటర్ ఖాతాలో వెరిఫైడ్ బ్లూ టిక్ మార్క్ (Verified blue tick mark) లేకపోవడం చూసి ధోనీ ఫ్యాన్స్, నెటిజెన్స్ రకరకాల సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
Ashwin Yadav dies of heart attack: హైదరాబాద్: మాజీ పేస్ బౌలర్ అశ్విన్ యాదవ్ (33) శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. 2007లో మొహాలీలో జరిగిన రంజీ ట్రోఫీలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన అశ్విన్ యాదవ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14 మ్యాచ్‌లు ఆడి 34 వికెట్లు పడగొట్టారు.
ప్రపంచమంతటా ఓ వైపు కరోనావైరస్ పట్టిపీడిస్తుంటే.. మరోవైపు వింత వింత సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కజకిస్థాన్ దేశానికి చెందిన బాడీ బిల్డర్ యూరి టోలోచ్కో (Yuri Tolochko ) ఓ సెక్స్ బొమ్మను వివాహమాడిన వింత ఘటన తాజాగా వెలుగు చూసింది.
భారత క్రికెట్ మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) అంతర్జాతీయ క్రికెట్ ఫార్మట్ నుంచి శనివారం రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ధోని రిటైర్మెంట్ ( dhoni retirement ) తీసుకుంటున్నట్లు ప్రకటించగానే.. అభిమానులంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు.
టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ఇటీవల ఫుల్లు ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి బౌలర్లకు పెనుసవాలుగా మారడంతో పాటు ఐసిసి ర్యాంకింగ్స్‌లోనూ కోహ్లీ అగ్రభాగాన కొనసాగుతున్నాడు.
భారత టెన్నిస్ క్రీడాకారిణి, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ సతీమణి సానియా మీర్జాను బంగ్లాదేశ్ క్రికెటర్ షబ్బీర్ రెహ్మాన్ టీజ్ చేశారన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వరుస విజయాలతో దూసుకుపోయిన కోహ్లీసేనకు బ్రేక్ పడింది. గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన lనాల్గో వన్డే క్రికెట్ లో పరాభావం ఎదురైంది. లక్ష్యసాధనకు చేరువైనా 21 పరుగుల తేడాతో టీమిండియా చతికిలపడింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో 334 పరుగులు చేసింది. ఆతర్వాత బ్యాటింగ్ దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో 313 పరుగులు చేసింది. తుదివరకు పోరాడినా ఆఖర్లో చతికిలపడింది. జాదవ్, రోహిత్, రహానే అర్థసెంచరీలతో మెరిసిన ఫలితం లేకపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.