OnePlus 12R Sales Start today: స్మార్ట్ ఫోన్స్ ల్లో వన్ ఫ్లస్ బ్రాండ్ కు ఉన్న క్రేజే వేరు. గత కొంత కాలంగా ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్స్ తో మెుబైల్స్ ను లాంచ్ చేస్తోంది ఈ సంస్థ. గత నెలలో వన్ ఫ్లస్ 12 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయగా.. ఈ రోజు (ఫిబ్రవరి 5) మరో అదిరిపోయే ఫోన్ ను రిలీజ్ చేయబోతుంది. అదే OnePlus 12R. ఇది మిడ్-రేజ్ స్మార్ట్ ఫోన్. దీని విక్రయాలు మంగళవారం(ఫిబ్రవరి 06) మధ్యాహ్నాం నుంచి ఆరంభం కానున్నాయి. వన్ ఫ్లస్ ఇండియా వెబ్ సైట్ మరియు ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ అందుబాటులోఉండనుంది.
ఫీచర్స్:
** వన్ ఫ్లస్ 12ఆర్ ఎల్టీపీఓ4 సపోర్టు కలిగిన 6.78-అంగుళాల అమోలోడ్ ప్రో ఎక్స్ డీఆర్ డిస్ ప్లేతో వస్తుంది.
** పవర్ పుల్ క్వాలకమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ తో రాబోతుంది.
** అంతేకాకుండా ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ మరియు 256 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ను కలిగి ఉంది.
** ఇది 5,500mAh బ్యాటరీ, 100వాట్ సూపర్ వుక్ చార్జర్ ను కలిగి ఉంది.
** ఇందులో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరా 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్ 890 ప్రైమరీ సెన్సార్ తో వస్తుంది. మరోకటి 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా కాగా.. ఇంకోకటి 2ఎంపీ కలిగిన మాక్రో కెమెరా. ఇందులో అప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోపాటు ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఫ్రంట్ కెమెరా 16 ఎంపీతో వస్తుంది.
** ఇది ఎన్ఎఫ్సీ సపోర్టుతోపాటు Wi-Fi 7, బ్లూటూత్ 5.3 మరియు డ్యూయల్ నానో-సిమ్ సెటప్‌తో వస్తుంది.
** ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది.
** ఇది కూల్ బ్లూ మరియు ఐరన్ గ్రే వేరియంట్లలో లభించనుంది.
ఆఫర్స్:
ఈ ఫోన్ పై అదిరిపోయే బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు లేదా వన్ కార్డుని ఉపయోగించి వన్ ఫ్లస్ 12ఆర్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే.. రూ. 1000 తగ్గింపు లభిస్తుంది. సేల్స్ మెుదలైన 12 గంటలలోపు కొనుగోలు చేస్తే ఉచితంగా వన్ ప్లస్ జెడ్2 బడ్స్ పొందవచ్చు. వీటి ధర రూ. 4, 999 వరకు ఉంటుంది. 8GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999 మరియు 16GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 45,999.
Also Read: Car Buying Tips: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు
Also Read: Post Office Saving Scheme: బెస్ట్ సేవింగ్ స్కీమ్.. ఏడాదిలోనే రూ.70 వేలకు పైగా ఆదాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook