Bandi Sanjay: పెట్రోల్ బాదుడుపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చమురుపై పన్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగివచ్చాయి. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈక్రమంలోనే కేంద్రప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గింపు సాహసోపేత నిర్ణయమన్నారు. ఈనిర్ణయంతో దేశంలోని కోట్లాది మందికి ఎంతో ఉపశమనం కల్గుతుందని చెప్పారు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ప్రతి గ్యాస్ సిలిండర్ పై రూ.200 తగ్గించడం హర్షణీయమని బండి సంజయ్ చెప్పారు. దీని వల్ల కేంద్రంపై రూ.6100 కోట్ల భారం పడుతున్నా..పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. ఎరువుల సబ్సిడీ కోసం అదనంగా రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తామనడం చారిత్రాత్మకమన్నారు. బహిరంగ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరుగుతున్నా..ఆ భారాన్ని సబ్సిడీ రూపంలో మోదీ సర్కార్ భరిస్తోందన్నారు. రైతులపై భారం పడకుండా పాత ధరలకే ఎరువులు అందించడం జరుగుతుందన్నారు. బడ్జెట్‌లో లక్షా 5 వేల కోట్లను కేటాయించినట్లు గుర్తు చేశారు.
స్టీల్, సిమెంట్ ధరల నియంత్రణ చర్యలు తీసుకోవడం విప్లవాత్మక నిర్ణయమని అభిప్రాయపడ్డారు. స్టీల్ ఎగుమతులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించడం ద్వారా ధరలను కేంద్రం నియంత్రిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రజా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా..మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చినందని గుర్తు చేశారు. 8 ఏళ్ల పాలనలో ఎన్నో సంస్కరణాలను అమలు చేశారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లోనూ తమదే విజయమన్నారు బండి సంజయ్.
Also read:Etela on Kcr: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది..ఈటల నిప్పులు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook