Certificates lost in floods: వరదల్లో పాత సర్టిఫికెట్స్ పోయాయా ? డోంట్ వర్రీ..

Certificates damaged in floods: హైదరాబాద్‌ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా పోటెత్తిన భారీ వరదలు (  Hyderabad rains and floods )  అనేక ప్రాంతాలను పూర్తి జలమయం చేశాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌ని ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా భారీ వరదలు ముంచెత్తాయి. వరదల్లో ఇండ్లు నీట మునిగిన చోట చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో విద్యార్థుల సర్టిఫికెట్స్ ( Study certificates ) సమస్య ఒకటి.

Last Updated : Oct 21, 2020, 03:42 AM IST
Certificates lost in floods: వరదల్లో పాత సర్టిఫికెట్స్ పోయాయా ? డోంట్ వర్రీ..

Certificates damaged in floods: హైదరాబాద్‌ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా పోటెత్తిన భారీ వరదలు (  Hyderabad rains and floods )  అనేక ప్రాంతాలను పూర్తి జలమయం చేశాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌ని ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా భారీ వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో ఇళ్లు నీట మునిగిన చోట వరద బాధితుల తిప్పలు అన్నీ ఇన్ని కావు. అందులో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో విద్యార్థుల సర్టిఫికెట్స్ ( Study certificates ) సమస్య ఒకటి. వరదల్లో సర్టిఫికెట్స్ తడిసి ముద్దవడం, లేకుండా కొట్టుకుపోవడం, వరదల తర్వాత సర్టిఫికెట్స్ కనిపించక పోవడం వంటి పరిణామాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టేశాయి. Also read : Hyderabad floods: నేటి నుంచే వరద బాధితులకు రూ. 10 వేల ఆర్థిక సహాయం 

వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన చోట తమ గోడు వెళ్లబోసుకుంటున్న బాధితులు అధిక సంఖ్యలో చెబుతున్న విషయాల్లో సర్టిఫికెట్స్ కోల్పోవడం కూడా ఒకటి కావడంతో సర్టిఫికెట్లు పాడైపోయిన వారికి, పోగొట్టుకున్న వారికి వాటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ( Telangana education minister Sabitha Indra Reddy ) తెలిపారు. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశాలతో మంగళవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. Also read : Hussain Sagar Water Level: పూర్తిగా నిండిన హుస్సేన్ సాగ‌ర్.. భారీగా నీటి విడుదల 

సర్టిఫికెట్స్ కోల్పోయిన వారు కొత్త వాటి కోసం  లేదా డూప్లికేట్‌ సర్టిఫికెట్ల కోసం ఆన్‌లైన్‌‌లో కానీ లేదా ఆఫ్‌లైన్‌‌లో కానీ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. దరఖాస్తులను త్వరగా పరిశీలించి విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్స్ వీలైనంత త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులకు స్పష్టంచేశారు. పోటీ పరీక్షలకు ( Competitive exams ), ఉపాధి అవకాశాలు ( Job opportunities )  కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు, విద్యార్థులకు ఈ వార్త కొంత ఊరట కలిగించింది. 

ఇదిలావుంటే, మరోవైపు భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అన్ని పరీక్షలను దసరా వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది ( OU Exams, JNTU exams, Dr.B.R.Ambedkar open university exams postponed ) . దీంతో ఉస్మానియా యూనివర్శిటీ, జేఎన్టీయూ, డా. బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఆయా విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్స్ ప్రకటించారు. Also read : Puranapool Bridge Cracks: పురానాపూల్‌ బ్రిడ్జి సురక్షితమే.. వాహనాలు రైట్ రైట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News