MLC Kavitha: వందరోజుల్లో కాంగ్రెస్ పాపం పండుతుంది.. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

Telangana: ఏ హోదాలో అధికారిక కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని పిలుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ప్రజాధనాన్ని పార్టీ కార్యక్రమాలకు దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 4, 2024, 08:07 AM IST
  • - బీజేపీ సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారు..
    - ప్రియాంక గాంధీని ఎలా పిలుస్తారు..
    - కాంగ్రెస్ ను ఆ పార్టీ నేతలే పడకొడతారు..
MLC Kavitha: వందరోజుల్లో కాంగ్రెస్ పాపం పండుతుంది.. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

MLC Kavitha Fires On CM Revanth Reddy: కేసీఆర్ కుటుంబంపై ఏడుస్తున్న రేవంత్ రెడ్డి 22  కుటుంబాలకు కాంగ్రెస్ టికెట్లు ఎలా ఇచ్చారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం నాడు హైదరాబాద్ లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి పాలనలో సామాజిక దృక్కోణం కొరవడిందని ఆమె అన్నారు.

ఏ హోదాలో అధికారిక కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని పిలుస్తారని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  “ఆమె కనీసం దేశంలో ఏ ఒక్క గ్రామం నుంచి అయినా సర్పంచ్ గా గెలిచిందా ? ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా గెలిచారా ? రాష్ట్రంలో ఏ ప్రోటోకాల్ లో అయినా ఉందా ఆమె ? మీ పార్టీకి చెందిన ముఖ్యనాయకురాలైతే ఇంటికి పిలుచుకొని మీ మనువడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి. తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి చీరసారె పెట్టి సాదరంగా సాగనంపండి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని పిలుస్తామంటే తప్పకుండా నల్లబుగ్గలు ఎగరేసి నిరసన తెలియజేస్తామని'' హెచ్చరించారు.

Read More: Snake Viral Video: ఈ చెట్లంటే పాములు పడిచస్తాయంట.. ఇవి ఇంట్లో ఉంటే పాములకు గ్రీన్ కార్పెట్ వేసినట్లే..

 ప్రజలను మభ్యపెట్టడం చాలా తప్పని, తెలంగాణ ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తే, ప్రియాంకా గాంధీని ఆహ్వానిస్తే తప్పకుండా తాము నిరసనలు తెలియజేస్తామని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని ఆహ్వానిస్తే నల్లబుగ్గలు ఎగరేసి నిరసనలు కవిత హెచ్చరించారు. అమరవీరులకు నివాళలుర్పించని  రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ కాళ్లు మొక్కారని ఆమె ఆరోపణలు చేశారు.

జై సోనియమ్మ అన్నారు కానీ..  జై తెలంగాణ అని అనలేదని మండిపడ్డారు. కనీసం అమరవీరులకు నివాళులు కూడా అర్పించనందుకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.  అదే విధంగా.. కులగణన ప్రక్రియను తక్షణమే మొదలుపెట్టలని, అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేస్తారా లేదా సూటిగా చెప్పాలని కవిత ప్రశ్నించారు.

బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, కాంగ్రెస్ ను పడగొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముఠామేస్త్రీలా మాట్లాడుతున్నారు.... ఆయనను ప్రజలు యూ-టర్న్ సీఎం అని అంటున్నారని కవిత ఎద్దెవా చేశారు. నల్గొండ, ఖమ్మం కాంగ్రెస్ నేతలే ప్రభుత్వాన్ని పడగొడుతారని ఆమె జోస్యం చెప్పారు. జార్ఖాండ్ ఎమ్మెల్యేల క్యాంపు కోసం కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేస్తుందా లేదా ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తున్నారా అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.

భారత జాగృతిపై, తనపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదని సూచించారు. పార్టీ సభకు ప్రభుత్వ నిధులు ఎందుకు వాడుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హెలికాప్టర్ లో వెళ్లి పార్టీ సభలో పాల్గొనడం ఏంటని అడిగారు. సభకు పెట్టిన ఖర్చు ఎంత ? వసతులు వాడుకున్నందుకు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ డబ్బు చెల్లించిందా?..  చెప్పాలని సూచించారు.

శిశుపాలుడి వంద పాపాలు పండినట్లుగా వందరోజులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తప్పులు పండుతాయని, అప్పుడు ప్రజాక్షేత్రంలో తప్పకుండా నిలదీస్తామని తెలిపారు. కానీ గత 60 రోజులుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత  ప్రతిపక్ష పార్టీగా తమపై ఉందని అన్నారు.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, బడ్జెట్ ప్రవేశపెట్టి రెండు రోజులు గడుస్తున్నా స్పందించకపోవడం దారుణమన్నారు. ఎందు కోసం మాట్లడడం లేదా? ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి వంతపాడుతూ రక్షించడం లేదా అని నిలదీశారు.

బీజేపీని ఎందుకు ఎండగట్టడం లేదని అడిగారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కసారైనా మాట్లాడలేదని విమర్శించారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్సీ కవిత సమాధానమిస్తూ.... పార్టీ ఎలా నిర్ణయిస్తే అలా అని వ్యాఖ్యానించారు. తమది కాంగ్రెస్ పార్టీలా కాదని, క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ పార్టీలో తమకు తాము ప్రకటించుకోబోమని, పార్టీ నిర్ణయిస్తుందని  అన్నారు. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News