TPCC New President: అధికారంలో ఉన్న తాము మరో వచ్చే పదేళ్లు అధికారంలోనే ఉంటామని రేవంత్ రెడ్డి పూర్తి ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేసి సత్తా చాటాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌లో ఆదివారం పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: Bag Creats Tension: రేవంత్ రెడ్డి నివాసం వద్ద బ్యాగ్ కలకలం.. భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడిగా తాను చేపట్టిన పదవీకాలంపై రేవంత్ గుర్తు చేసుకుని మాట్లాడారు. '7 జూన్ 2021న నన్ను టీపీసీసీ అధ్యక్షుడిగా నియనించారు. 7 జూలై 2021న నేను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లా. ఇంద్రవెల్లి నుంచి సమరశంఖం పూరించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం' అని వివరించారు. సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.
Also Read: Bhaskar Award: తెలంగాణలో 'భాస్కర అవార్డు'.. ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు కేటీఆర్ సిఫార్సు
'మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలనే నినాదంతో ఒకవైపు నేను, మరోవైపు భట్టి విక్రమార్క పల్లెపల్లెనా పాదయాత్ర చేశాం. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది' అని రేవంత్ చెప్పారు. ఈ సందర్భంగా మరో హామీని నెరవేరుస్తామని ప్రకటించారు. 'రాబోయే పంట నుంచి సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తాం' అని కీలక ప్రకటన చేశారు. మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.
'వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దీక్ష పూనింది. త్వరలో తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. 2028లో ఒలింపిక్సలో దేశం తరఫున బంగారు పథకాలు సాధించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది' అని రేవంత్ రెడ్డి వెల్లడంచారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగరేసి రాహుల్ గాంధీని ప్రధాని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్లు అని పేర్కొన్నారు.
'రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ పార్టీదే అధికారం' అని రేవంత్ ప్రకటించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 పార్లమెంట్ స్థానాలు గెలిస్తేనే మనం ఫైనల్స్ గెలిచినట్టు అని తెలిపారు. అప్పటి వరకు ఎవరూ విశ్రమించొద్దని సూచించారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లో బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటన చేశారు. కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత మా నాయకులపై ఉందని.. మీ ఎన్నికలకు మా ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడతామని చెప్పి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.