ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh ) ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కొత్త పంథాను అవలంభిస్తోంది. కరోనావైరస్ ( Coronavirus ) టెస్టులు, కాంటాక్ట్ ట్రేసింగ్, చికిత్సలో దేశంలో మంచి గుర్తింపు సాధించిన ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల సహాయంతో రాష్ట్రాన్ని కరోనావైరస్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వెయ్యి యాంబులెన్సులు ప్రారంభించి సంచలనం క్రియేట్ చేశారు ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( YS Jagan ). తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని మండపేటలో కేవలం రెండు గంటల్లోనే రేషన్ కార్డును జారీ చేసి రికార్డు క్రియేట్ చేశారు గ్రామ సచివాలయ సిబ్బంది.
Also Read: Aadhaar Lock & Unlock: మీ ఆధార్ దుర్వినియోగం అయిందా ? ఇలా లాక్ చేసి అన్ లాక్ చేయండి!
మండపేట గ్రామ సచివాలయ ఉద్యోగులు కేవలం రెండు గంటల్లోనే రేషన్ కార్డును జారీ చేసిన లబ్ధిదారులకు అందచేశారు. ఆంధ్రప్రదేశ్ ( AP) రాష్ట్ర చరిత్రలో ఇలా ఒక్క రోజులోనే రేషన్ కార్డు జారీ అవడం ఇదే తొలిసారి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ (Twitter ) ఎకౌంట్ లో ట్వీట్ చేసి సమాచారం అందించింది.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని చల్లపల్లి, లక్ష్మీపురంలో దరఖాస్తు చేసుకున్న ఐదుగంటల్లోనే రైస్ కార్డు జారీ చేశారు. లక్ష్మీపురం-3 గ్రామానికి చెందిన కె. మహాలక్ష్మీ అనే మహిళ రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసింది. ఉదయం 9.51 నిమిషాలకు అమె రైస్ కార్డు కోసం అప్లై చేశారు. ఆ గ్రామానికి చెందిన సచివాలయ సిబ్బంది రైస్ కార్డు జారీ కోసం దాదాపు 6 దశల వెరిఫికేష్ ప్రక్రియను మధ్యాహ్నం లోపు పూర్తి చేసి 3.25 నిమిషాలకు కార్డును లబ్ధిదారు అయిన మహిళకు అందజేశారు.
Also Read: Kids Using Smartphones: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? ఇలా చేయండి!
దీనికి సంబంధిచించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ఇందులో తూర్పుగోదావారి జిల్లా, అలమూరు మండటం, మడికి గ్రామంలో సరికొత్త రికార్డు.. కూచిపూడి ఆంజనేయులు, వరలక్ష్మి దంపతులకు రేష్ కార్డు మంజూరి చేసినట్టు తెలిపారు. కాగా వేగంగా కార్డుల జారీ చేసిన గ్రామ వాలంటీర్లను ప్రజలు అభినందిస్తున్నారు. ఇలాగే తమ సమస్యలకు వేగంగా పరిష్కారం చూపించడం కొనసాగించాలి అని కోరుకుంటున్నారు.
ఒక్క రోజులో రేషన్ కార్డు#YSJaganMarkGovernance #YSJaganCares pic.twitter.com/y3hcvKZX2Z
— YSR Congress Party (@YSRCParty) September 18, 2020