Intel Layoffs: కొనసాగుతున్న ఉద్యోగుల ఉద్వాసన, ఇప్పుడు ఇంటెల్ నుంచి వందలాదిమంది ఇంటికి

Intel Layoffs: ఉద్యోగుల ఉద్వాసన కొనసాగుతోంది. అమెజాన్, ట్విట్టర్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు..ఇప్పుడు ఇంటెల్ కూడా వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించేసింది. ఆ వివరాలు చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 11, 2022, 01:10 AM IST
Intel Layoffs: కొనసాగుతున్న ఉద్యోగుల ఉద్వాసన, ఇప్పుడు ఇంటెల్ నుంచి వందలాదిమంది ఇంటికి

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక పరిస్థితుల నేపధ్యంలో ఉద్యోగుల మెడపై ఉద్వాసన కత్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకదాని తరువాత మరొక సంస్థ వందల సంఖ్యలో ఉద్యోగుల్ని ఇంటికి పంపించే పని చేస్తోంది. 

ప్రపంచంలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభం కారణంగా మొత్తం 853 సాఫ్ట్‌వేర్ సంస్థలు 1,37,492 మందిని వివిధ సందర్భాల్లో ఆయా సంస్థలు తొలగించాయి. ఆర్ధిక మాంద్యం పెరుగుతున్న నేపధ్యంలో ఆ పరిస్థితి ఇంకా పెరుగుతోంది. మెటా, ట్విట్టర్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి కంపెనీలు సైతం ఉద్యోగుల్ని పెద్దఎత్తున తొలగించేస్తున్నాయి. తాజాగా ప్రముఖ చిప్ మేకర్ కంపెనీ ఇంటెల్ ఉద్యోగుల్ని తొలగించింది. ఖర్చుల్ని తగ్గించుకునే క్రమంలో..ఇంటెల్ కాలిఫోర్నియాలో 201 మంది ఉద్యోగుల్ని ఇంటెల్ సంస్థ తొలగించింది. ఇందులో వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ ప్రకారం 111 మందిని తొలగించగా మరో 90 మందిని కంపెనీ ప్రధాన కార్యాలయం శాంటా క్లారా లొకేషన్ నుంచి ఇంటికి పంపించింది. వచ్చే ఏడాది జనవరి 31 నుంచి ఈ తొలగింపుల ప్రక్రియ అమలు కానుంది. 

పీసీ విక్రయాలు గణనీయంగా పడిపోవడంతో వేలాదిమందిని ఇంటెల్ తొలగించింది. మరోవైపు ఖర్చుల్ని గణనీయంగా తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని..ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింగర్ తెలిపారు. 2025 సంవత్సరం ఆఖరికి ఇంటెల్ సంస్థ ఏడాదికి 8-10 బిలియన్ డాలర్లు ఆదా చేయాలని భావిస్తోంది. 

Also read: PF Balance: పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేయాలనుకుంటున్నారా..? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News